RRR Movie Janani Song: ఆర్ఆర్ఆర్ నుండి మ‌రో అప్‌డేట్.. జ‌న‌ని సాంగ్‌కి టైం ఫిక్స్‌

RRR Movie Janani Song: ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి .. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. జ‌న‌వ‌రి 7న చిత్రం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ స్పీడ్ పెంచారు. ఇప్ప‌టికే చిత్రం నుండి రెండు సాంగ్స్ విడుద‌ల కాగా, మూవీ నుండి మ‌రో సాంగ్ విడుద‌ల చేసేందుకు టైం ఫిక్స్ చేశారు.

RRR Movie Janani Song Release on 26th Nov
RRR Movie Janani Song Release on 26th Nov

జ‌న‌ని అంటూ సాగే పాట నవంబ‌ర్ 26న విడుద‌ల కానుందంటూ మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. పోస్ట‌ర్ లో ఎన్టీఆర్, రామ్ చ‌రణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌నిపిస్తుండ‌గా, దానిపై హిందీలో వందేమాత‌రం అని రాసి ఉంది. పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను 2020 జూలై 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కరోనా మహామ్మారి విజృంభనతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను 8 జనవరి 2021 న మరోసారి రిలీజ్ డేట్ మార్చారు. ఇక అప్పటికీ కరోనా కెేసులు తగ్గకపోవడంతో పాటు షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమాను 13 అక్టోబర్ 2021 దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మూడు రిలీజ్ డేట్లు ఛేంజ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు 7 జనవరి 2022న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

RRR Movie Janani Song Release on 26th Nov
RRR Movie Janani Song Release on 26th Nov

మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నో ఆటూ పోట్లను ఎదుర్కొని ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ కెరీర్‌లో తొలిసారి.. వరుసగా 2019, 2020, 2021 మూడు కాలండర్ ఇయర్స్‌లో సినిమా విడుదల కాకపోవడం.. మరోవైపు రామ్ చరణ్‌కు 2020,2021లో ఏ సినిమా విడుదలకు నోచుకోకపోవడం ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేకత అనే చెప్పాలి

ఆర్ఆర్ఆర్ ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తోండ‌గా, డివివి దానయ్య దీనిని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలాగే చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం వీరిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకున్నాయి.