RRR: పున‌ర్జ‌న్మ కాన్సెప్ట్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రం.. !

RRR ద‌ర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక‌ల్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం ప‌లుమార్లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మూవీ రిలీజ్ లేట్ అవుతూ వ‌చ్చింది. అక్టోబ‌ర్ 13న చిత్రాన్ని త‌ప్ప‌క విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తి కాగా, ప్ర‌స్తుతం సాంగ్స్ చిత్రీక‌రిస్తున్నారు.

RRR

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‏తో సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోతో.. సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక జక్కన్న కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

RRR

ఈ సినిమాకు సంబంధించి కొన్నాళ్లుగా అనేక వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. మ‌గ‌ధీర‌, ఈగ మాదిరిగానే రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం తెర‌కెక్కించాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా… చ‌ర‌ణ్ న‌టిస్తుండగా, వేర్వేరు ప్రాంతాలకు, నేప‌థ్యాలకు చెందిన వీరిద్ద‌రు క‌లిస్తే ఎలా ఉంటుందనే నేప‌థ్యంలో చిత్రాన్ని రూపొందించార‌ని అంటున్నారు.

పున‌ర్జ‌న్మ కాన్సెప్ట్ క్లైమాక్స్‌కి ముందే జ‌రుగుతుంద‌ని, ఆ ఎపిసోడ్ చాలా ఆసక్తి క‌రంగా ఉంటుంద‌ని ఓ ప్ర‌చారం జోరుగా న‌డుస్తుంది. బానిస సంకెళ్ల నుండి విముక్తి క‌ల్పించిన త‌ర్వాత కొమ‌రం భీమ్, అల్లూరి సీతారామ‌రాజు మ‌రో జ‌న్మ ఎత్తి, మ‌ళ్లీ క‌లుసుకుంటే ఎలా ఉంటుంద‌న్న అంద‌మైన ఊహ‌తో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందించి ఉంటార‌ని ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్ర సీక్వెల్ ఉంటుందా అనే ఊహాగానాలు కూడా వ‌స్తున్నాయి. అయితే సీక్వెల్ దాదాపుగా ఉండదు కాని, ఆ ఆలోచ‌న మాత్రం ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రిలోనూ ర‌గిలించేలా రాజమౌళి క్లైమాక్స్‌ని రూపొందించి ఉంటాడ‌ని ఇన్‌సైడ్ టాక్. చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఒలీవియా మోరిస్ న‌టిస్తున్నారు.