RRR: హాలీవుడ్ రేంజ్‌లో ఆర్ఆర్ఆర్.. విజువ‌ల్స్ చూసి నోరెళ్ల‌పెడుతున్న ఫ్యాన్స్

RRR: కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న క‌ల్పి చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు.

RRR

ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఇప్ప‌టికే ప‌లు వీడియోలు విడుద‌ల చేశాడు రాజ‌మౌళి. ఈ వీడియోల ద్వారా హీరోల ప‌రాక్ర‌మాన్ని చూపిస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచాడు. ఇక కొద్ది సేప‌టి క్రితం మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో రాజ‌మౌళి చేసిన హార్డ్ వ‌ర్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్‌కి త‌గ్గ‌కుండా సినిమాని రూపొందించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

RRR

సెట్స్‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు, గ్రాఫిక్స్, ఆర్టిస్టుల ప‌ర్‌ఫార్మెన్స్ చూస్తుంటే ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా క‌నిపిస్తున్నాయి. వీడియోలో రామ్ చ‌రణ్‌, అలియా భ‌ట్, ఎన్టీఆర్, ఒలీవియా, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ‌, స‌ముద్ర ఖ‌ని వంటి స్టార్స్‌ని ప‌లు ఫ్రేములలో చూపించి ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఈ వీడియో చూస్తుంటే బాహుబ‌లిని మించి ఆర్ఆర్ఆర్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

RRR

అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు స్వాతంత్య్ర ఆకాంక్ష ఎలా తీర్చుకున్నార‌నే నేప‌థ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు.

RRR

ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు.

RRR

ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, టర్కీష్, ఇంగ్లీష్, జపనీస్,చైనీస్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ స్పానిష్, భాషల్లో విడుదల కానుంది.