RRR 2 : ఆర్ఆర్ఆర్-2 వచ్చేది అప్పుడే.. క్లారిటీ వచ్చేసింది..!
NQ Staff - June 23, 2023 / 11:55 AM IST

RRR 2 : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబోలో ఈ మూవీని తీశారు. కాగా ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుందంటే మామూలు విషయం కాదు.
ఇలాంటి త్రిబుల్ ఆర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు తీస్తారనేవ ఇషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే తాజాగా దానిపై క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ రావడానికి ఐదేండ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు రాజమౌళి.
ఆ మూవీ వచ్చే 2024 ద్వితియార్ధంలో స్టార్ట్ కాబోతోంది. ఆ మూవీని రెండేండ్ల వరకు తీసే అవకాశం కనిపిస్తోంది. అంటే 2026 చివరలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. 2027లో త్రిబుల్ ఆర్-2 ఊవీ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ సమయానికి వేరే కథ ఉంటే.. కచ్చితంగా రాజమౌళి అటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది.
రాజమౌళి వయసు కూడా మీద పడుతోంది కాబట్టి.. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమాను కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పట్లో త్రిబుల్ ఆర్-2 సినిమాపై ఆశలు పెట్టుకోవడం మానేస్తేనే బెటర్ అని అంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఏం జరుగుతుందో.