Rowdy Boys Review: రౌడీ బాయ్స్ మూవీ రివ్యూ

Rowdy Boys Review: సినిమా పరిశ్ర‌మ‌కు వార‌సుల రాక కొత్తేమి కాదు. ఇప్ప‌టికే ఎంతో మంది వార‌సులు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి స‌త్తా చాటుతున్నారు. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒక‌రైన దిల్‌రాజు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతోన్న ఆయన కుటుంబానికి చెందిన ఎవరూ సినీ రంగ ప్రవేశం చేయలేదు. అయితే తొలిసారి ఈ బడా నిర్మాత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి హీరోగా పరిచయమవుతున్నాడు. దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్‌ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

Rowdy Boys Review
Rowdy Boys Review

ఆశిష్ హీరోగా రూపొందుతున్న చిత్రం రౌడీ బాయ్స్. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. అమ్మాయి కోసం రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ అనే ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కంది.

క‌థ‌:

ఆశిష్ ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా అక్షయ్ పాత్రలో, అనుపమ పరమేశ్వరన్ మెడికల్ స్టూడెంట్ కావ్య పాత్రలో నటించారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే అక్కడ ఉన్న ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల మధ్య గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. కథ మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. ఆ గొడ‌వ‌ల‌ను సాల్వ్ చేసుకొని వీరిద్ద‌రు ఎలా ప్ర‌యాణం సాగించారు అనేది సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

Rowdy Boys Review
Rowdy Boys Review

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్ :

యాక్టర్ ఆశిష్ కు మొదటి సినిమా అయినప్పటికీ అద్భతంగా నటించారు. ప్ర‌తి స‌న్నివేశంలోను త‌న‌దైన శైలిలో జీవించాడు. ఇక అనుప‌మ పర‌మేశ్వ‌ర‌న్ కూడా చాలా ప‌రిణితితో న‌టించింది. ఆశిష్, అనుపమ జోడీ అదిరింది అని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆశిష్ డాన్సులు, పర్మార్మెన్స్ కూడా బాగుంది ఎమోషనల్ సీన్స్ పండించాడు. మిగ‌తా న‌టీన‌టులు కూడా ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టారు.

టెక్నీషియ‌న్స్ ప‌ర్‌ఫార్మెన్స్:

రౌడీబాయ్స్ చిత్రంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు హ‌ర్ష సినిమాని అంత‌గా డీల్ చేయ‌లేక‌పోయాడు. కొన్ని స‌న్నివేశాలు తేలిపోయాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఓ హైలైట్. రొటీన్ కాలేజ్ గ్యాంగ్ వార్స్ కు కొంచం భిన్నంగా ఉంటుంది ఈ స్టోరి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కొన్ని స‌న్నివేశాల‌ను ట్రిమ్ చేస్తే బాగుండేది. కెమెరా ప‌నిత‌నం కూడా బాగుంది. కొరియోగ్ర‌ఫీ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది.

Rowdy Boys Review
Rowdy Boys Review

ప్ల‌స్ పాయింట్స్ :

  • న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్
  • మ్యూజిక్
  • ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్

మైన‌స్ పాయింట్స్

  • క‌థ‌నం స‌రిగ్గా లేక‌పోవ‌డం
  • పాయింట్‌ని స‌రిగ్గా డీల్ చేయ‌క‌పోవ‌డం

విశ్లేష‌ణ: ఇంజినీరింగ్ వర్సెస్ మెడికల్ స్టూడెంట్స్ కథగా రూపొందిన రౌడీ బాయ్స్ చిత్రం కొంత ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నా కొన్ని స‌న్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తున్నాయి. యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింద‌నే చెప్పాలి.

రేటింగ్: 2.5/5