Roshan: హీరో కొడుకు వెనక క్యూ కడుతున్న పెద్ద బేనర్స్.. స్టార్ హీరో అవతారం ఎత్తనున్నాడా..!
NQ Staff - January 22, 2022 / 01:15 PM IST

Roshan: ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన శ్రీకాంత్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోను సత్తా చాటుతున్నాడు. రీసెంట్‌గా అఖండతో విలన్ అవతారం ఎత్తాడు. ఆయన తనయుడిని కూడా ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాడు.

rashan play the lead in the sequel of pelli sandadi1
రోషన్ `నిర్మలా కాన్వెంట్` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యితే ఇందులో కింగ్ నాగార్జున మెరిసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ఆ తరువాత `పెళ్లిసందD`తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించాడు. సినిమాకు నెగెటివ్ ప్రచారం జరిగినా దసరా సీజన్ లో రిలీజ్ కావడం హీరోయిన్ గ్లామర్ రోషన్ నటన డ్యాన్సులు ఈ మూవీకి ప్లస్ గా మారి మంచి వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ఆయనకు పలు బేనర్స్ నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తుంది.
వైజయంతీ మూవీస్ పతాకంపై, అశ్వనీదత్ నిర్మాతగా ఓ చిన్న సినిమా రూపుదిద్దుకొంటోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటించనున్నాడు. కథ రెడీ అయ్యింది. మిగిలిన అన్ని వివరాలూ త్వరలోనే చిత్రబృందం ప్రకటించబోతోంది. రోషన్ చేతిలో మరో సినిమా కూడా పడింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రోషన్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోంది. అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి.
.
`పెళ్లి సందడి`తో తెరపైకొచ్చాడు రోషన్. ఆ సినిమా రివ్యూల పరంగా అటూ ఇటూ ఊగినా, వసూళ్ల పరంగా మంచి లాభాలు అందుకుంది. దసరా సీజన్‌లో విడుదల కావడం పెళ్లి సందడికి కలిసొచ్చింది. రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండడం, డాన్సులు బాగా చేయడంతో.. తనకు ఆ సినిమా బాగా హెల్ప్ అయ్యింది.

rashan play the lead in the sequel of pelli sandadi3
అందుకే వైజయంతీ మూవీస్ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంది. ముందు అశ్వనీదత్ సినిమా పూర్తి చేస్తాడు రోషన్. ఆ తరవాత… సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా పట్టాలెక్కుతుంది.