Roja Selvamani: త‌న భ‌ర్త‌తో రోజా చేసిన సంద‌డి చూస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

Roja Selvamani: ఒక‌ప్పుడు స్టార్ హీరోలు అంద‌రితో క‌లిసి ప‌ని చేసిన రోజా ప్ర‌స్తుతం రాజ‌కీయాలతో బిజీగా ఉంటూనే బుల్లితెర‌పై సంద‌డి చేస్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోను హ‌డావిడి చేస్తుంది. ఫ్యామిలీతో వీలైనంత ఎక్కువ స‌మ‌యం కేటాయించే రోజా తన కూతురు, కొడుకు పుట్టిన రోజు వేడుకలు, పండగలలో తెగ సంద‌డి చేస్తుంటుంది.

వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, నెటిజ‌న్స్‌ని కూడా అల‌రిస్తుంటుంది. కాగా.. తాజాగా .. తన భర్త సెల్వమణి పుట్టిన రోజు వేడుకలను సంబరంగా జరిపారు.హ్యాప్ బర్త్ డే మై లవ్ అంటూ.. తన భర్త పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను రోజా షేర్ చేశారు. ఈ ఫోటోలు ఆమె ఫేస్ బుక్ లో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పుట్టిన రోజు వేడుకల్లో రోజా, వారి కుమార్తె, కొడుకు, ఇతర కుటుంబసభ్యలు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. సూపర్ కపుల్, సూపర్ ఫ్యామిలీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. కొందరు.., సెల్వమణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

రోజా, సెల్వమణి దంప‌తుల‌కి ఓ కూతురు అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు. ఇప్పుడు ఆమె కూతురు అన్షు మాలిక కూడా తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకున్నారు.అన్షు మాలిక రైటర్‌, ప్రోగ్రామర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటడంతో యంగ్‌ సూపర్‌ స్టార్‌ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో ఇన్‌ప్లూయెన్సర్‌ యూకే మేగజైన్‌ ఆమె కవర్‌ ఫోటోను ప్రచురించింది. ఇలాంటి అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని అన్షు ఇటీవ‌ల‌ తెలిపింది.