Roja: విధి ఎవరిని విడిచి పెట్ట‌దు.. అందరిని ఏడిపించ‌డం వ‌ల్ల‌నే నువ్వు ఏడుస్తున్నావ‌న్న రోజా

Roja: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ఆయ‌న చాలా భావోద్వేగానికి గురయ్యారు. ప్రెస్‌మీట్‌లోనే వెక్కి, వెక్కి ఏడ్చారు.. పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఓదార్చారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల్ని అవమానిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

TheNewsQube-
roja fires on chandra babu (2)
roja fires on chandra babu (2)

తన భార్య భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదన్నారు. క్యారెక్టర్ అసానినేషన్ చేస్తున్నారని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎంతో ఓర్పుగా ఉన్నానన్నారు చంద్రబాబు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చూడలేదని.. ఇంత బాధ భరించలేదన్నారు.

బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురి చేసినా భరించానన్నారు. అధికారంలో తాను ఎవర్నీ కించపరచలేదని.. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగిందని.. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతగా భావించాను అన్నారు. ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజా క్షేత్రంలోనే పోరాడతానని.. తన ధర్మ పోరాటానికి ప్రజలు సహకరించాలన్నారు. మళ్లీ ప్రజల మద్దతుతో మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు.

అయితే తాజాగా చంద్ర‌బాబు ఏడ‌వ‌డం విష‌యంపై రోజా స్పందించింది. విధి ఎవ‌రిని విడిచిపెట్ట‌దు. అంద‌రి స‌ర‌దా తీర్చేస్తుంది. 72 ఏళ్ల వ‌య‌స్సులో ఎన్టీఆర్‌ని ఎంత ఏడ్పించావు. నువ్వు ఆ వ‌య‌స్సు కన్నా ముందే ఏడుస్తున్నావ్. అందుకే అంటారు మ‌నం ఏది చేస్తే అది తిరిగి మ‌న‌కు వ‌స్తుంద‌ని. నీ భార్యను అన్నార‌ని తెగ బాధ‌ప‌డుతున్నావు.

ఆ రోజు అసెంబ్లీలో రోజా బ్లూ ఫిలింలో యాక్ట్ చేసింద‌ని పీత‌ల సుజాత‌తో చెప్పించావు. అప్పుడు నేను ఎంత బాధ‌ప‌డ్డానో నీకు తెలియ‌దా, నాకు కుటుంబం, పిల్లలు ఉన్నారు క‌దా.నీతో ప‌ని చేసినప్పుడు కూడా నన్ను చాలా అవ‌మానానికి గురి చేశావు. న‌న్ను రెండున్న‌ర ఏళ్లు త‌ప్పించావు. కాని ఇక నీకు రాజ‌కీయ భ‌విష్య‌త్ అనేది లేకుండా దేవుడు చేస్తున్నాడు. బైబై బాబు అంటూ రోజా చెప్పుకొచ్చింది.