Roja: సునీత రెండో పెళ్ళి.. వాళ్ల‌స‌లు మ‌నుషులేనా అంటూ రోజా కామెంట్స్

ప్ర‌ముఖ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత కొద్ది రోజుల క్రితం డిజిట‌ల్ మీడియాకు చెందిన రామ్ వీర‌ప‌నేని అనే వ్య‌క్తితో పెళ్ళి పీట‌లు ఎక్కిన సంగ‌తి తెలిసిందే. సునీత పెళ్లి వ్య‌వహారం తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, దీనిపై ఎవ‌రికి నచ్చిన‌ట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రు సునీత‌కు స‌పోర్ట్ చేస్తుంటే మ‌రి కొంద‌రు ఆమెను ఏకి పారేస్తున్నారు. పెళ్ళీడొచ్చిన పిల్ల‌ల‌ను పెట్టుకొని ఇప్పుడు నీకు పెళ్లి అవ‌స‌ర‌మా అంటూ దూష‌ణ‌లకు దిగారు. అయితే వీరికి ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు నాగ‌బాబు, రోజా గ‌ట్టి స‌మాధానం ఇచ్చారు.

రీసెంట్‌గా నాగ‌బాబు .. సునీత‌, రామ్‌ల రెండో పెళ్లిపై స్పందించారు. ఇది వారి వ్య‌క్తిగ‌త విష‌యం. తోడు కావాల‌ని భావించి వారిరివురు వివాహం చేసుకున్నారు. ఈ విష‌యాన్ని పెద్ద‌ది చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక తాజాగా న‌టి, ఎంఎల్ఏ రోజా కూడా ఈ ఇష్యూపై గ‌ట్టిగానే స్పందించారు. సునీత త‌న జీవితంలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొని ఈ స్టేజ్‌కు వ‌చ్చింది. చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి కొద్ది రోజుల‌కే విడాకులు, పిల్ల‌ల‌ను పెంచే బాధ్య‌త ఇన్నింటిని మేనేజ్ చేస్తూ విజ‌యం సాధించింది. ఇప్పుడు త‌న బాధ్య‌త‌ల‌న్నీ తీరిపోవ‌డంతో రెండో పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండాల‌ని డిసైడ్ అయింది.

ఈ స‌మ‌యంలో పనిపాట లేని కొంత మంది వెధ‌వ‌లు అన‌వ‌స‌రంగా ర‌చ్చ చేస్తున్నారు. అస‌లు వాళ్ళు మ‌నుషులేనా అంటూ మండిప‌డ్డారు రోజా. మీ కుటుంబాల‌లోను సునీత లాంటి వ్య‌క్తి ఉండి ఉంటే ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్లా. పిల్ల‌లు, పెద్ద‌ల అంగీకారంతోనే సునీత రెండో వివాహం చేసుకుంది. ఆమె పెళ్ళి అనేది వ్య‌క్తిగ‌త విష‌యం. దీనిని ఇక నుండైన ర‌చ్చ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని గుర్తు పెట్టుకోవాల‌ని రోజా హితవు ప‌లికింది. కాగా, సునీత‌కు రామ్‌కు కొన్నేళ్ళ నుండి మంచి స్నేహా బంధం ఉండగా, అది ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్ళింది. క‌రోనా వ‌ల‌న కొద్ది మంది ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో వీరిరివురు వివాహం చేసుకున్నారు. ఇండ‌స్ట్రీకి సంబంధించిన కొంద‌రు ప్ర‌ముఖుల‌కు పార్టీలు ఇవ్వాల‌ని ప్లాన్ చేసిన ఈ జంట కొద్ది రోజుల త‌ర్వాత హ‌నీమూన్ కోసం మంచి ప్ర‌దేశాల‌కు వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Advertisement