Roja: కూతురు బ‌ర్త్ డే వేడుక‌లో చిందులేసిన రోజా.. వీడియో హ‌ల్చ‌ల్‌

Roja:వెండితెర‌పై స‌త్తా చాట‌డ‌మే కాకుండా రాజ‌కీయాల‌లోను దూసుకుపోతున్న‌రోజా త‌న అభియానుల‌ని ఏదో ర‌కంగా ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉంటారు. రాజ‌కీయాల‌లో ఉన్న‌ప్ప‌టికీ, అప్పుడప్పుడు బుల్లితెర షోస్‌తో సంద‌డి చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె కూతురుని కూడా సినిమాల‌లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ట‌.

Roja Dance in her Daughter Birthday Celebrations
Roja Dance in her Daughter Birthday Celebrations

రోజాకి ఇప్పుడు సినిమాల‌లో న‌టించే తీరిక లేదు. మరోవైపు ఆమె భర్త, దర్శకుడు సెల్వమణి కూడా సినిమాలు చేయడం లేదు. దీంతో తన కూతురు అన్షు మాలికని హీరోయిన్‌గా పరిచయం చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. చాలా రోజులుగా దీనికి సంబంధించిన ముందస్తు ప్రిపరేషన్‌ ప్రారంభమైందని తెలుస్తుంది. కొద్ది రోజులుగా అన్షు మాలిక యాక్టింగ్‌, డాన్స్ ల్లో శిక్షణ తీసుకుంటుందట. ఇప్పటికే నటన పరంగా, డాన్స్ ల పరంగా మంచి నైపుణ్యం సంపాదించిందని తెలుస్తుంది.

అన్షు మాలిక్‌కి సంబంధించిన ఏ ఈవెంట్ అయిన రోజా గ్రాండ్‌గా చేస్తుంది. రీసెంట్‌గా అన్షు మాలిక్ బ‌ర్త్ డేని చాలా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోల‌ను రోజా కొద్ది రోజుల క్రితం త‌న ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. ఇక ఇప్పుడు వీడియో కూడా షేర్ చేయ‌గా, ఇది వైర‌ల్ అయింది. ఇందులో రోజా త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి డ్యాన్స్ చేస్తున్న క్లిప్ ముచ్చ‌టగా అనిపించింది.

రోజా స్టెప్పులు చూస్తుంటే బుల్లెట్ బండి సాంగ్‌కి చిందులేసిన‌ట్టు తెలుస్తుంది. రోజా ఇప్ప‌టికీ ప‌లు షోస్ లో డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే రోజా కూతురు ఓ ప్రముఖ వారసుడి చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. రోజా దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారట.