Roja: సుధీర్, ర‌ష్మీల పెళ్లి చూడాల‌ని ఉంది.. రోజా కామెంట్స్ వైర‌ల్‌

Roja: బుల్లితెర‌పై కాని వెండితెర‌పై కాని కొన్ని కాంబినేష‌న్స్ ఎప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీన్ అన్న‌ట్టు అంటాయి. వారు రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను క‌లిసి ఉండ‌డాన్ని చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. బుల్లితెర‌పై అంద‌రి దృష్టిని ఎప్పుడు ఆక‌ర్షించే జంట సుధీర్-ర‌ష్మీ ఒక‌టి.వీరిని జంటగా చూస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుంటారు.

Roja Comments over Sudheer-Rashmi Marriage
Roja Comments over Sudheer-Rashmi Marriage

ఛానెల్స్ కూడా వీరిద్ద‌రితో ప‌లు ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంటారు. చిన్నితెరపై సుధీర్- రష్మీ కలిసి కనిపిస్తే చాలు ఇంట్లో ఈలలు పడాలి అన్నట్లుగా ఫేమ్ కొట్టేసింది .వీరిద్ద‌రి ప్రేమ‌, పెళ్లికి సంబంధించి బ‌య‌ట జోరుగా ప్ర‌చారాలు సాగుతుంటాయి. దానిని క్యాష్ చేసుకునే క్రమంలో ఇద్ద‌రికి ఉత్తుత్తి పెళ్లిళ్లు కూడా చేశారు.


తాజాగా వినాయక చవితి కోసం కూడా అలాంటి ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ ఎట్టకేలకు సుధీర్- రష్మీ 9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డ్ పడిందని తెలుస్తుండటం గమనార్హం. ‘ఊరిలో వినాయకుడు’ అంటూ ఈ వినాయక చవితి రోజు స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసి తాజాగా ఆ షో ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో 9 సంవత్సరాల సుధీర్- రష్మీ లవ్ స్టోరీ సీన్స్ ఓ రేంజ్‌లో ఆకర్షించాయి.


గత జ్ఞాపకాలు గుర్తుచేస్తూ ‘9 సంవత్సరాల తీపి గుర్తులను 9 గిఫ్ట్‌లుగా నీకు గుర్తుండి పోయేలా ఇస్తున్నా’ అంటూ ప్రేమ పాటల రూపంలో అందరూ ఫిదా అయ్యేలా సుధీర్‌పై మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టేసింది రష్మీ. ఇక ఈ సీన్ చూసిన రోజా.. 9 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఎంతో అందంగా ప్రపోజ్ చేసింది. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతి ఒక్కరి కోరిక అని చెప్పింది.


రోజా మాట‌లు విన్న త‌ర్వాత ర‌ష్మీ భావోద్వేగానికి గురైంది. సుధీర్ ర‌ష్మీ ఇద్దరు హ‌త్తుకొని ఉండ‌గా, వారి హావ‌భావాలు ఏదో ఫీలింగ్ క‌లిగించాయి. అయితే ఎస్ ప‌దాన్ని మీరిద్ద‌రు చెబుతారా అని ఇంద్ర‌జ అన‌గా, అక్క‌డ స‌స్పెన్స్ క్రియేట్ చేసి షోపై ఆస‌క్తి పెంచారు.వినాయ‌క చ‌వితి నాడు దీనికి సంబంధించిన అస‌లు విష‌యం బ‌య‌ట‌కు రానుంది.