Roja: ఘ‌నంగా రోజా బ‌ర్త్ వేడుక‌.. జ‌గ‌న్ బ‌ర్త్ డే గిఫ్ట్ ఇస్తారా..!

Roja: రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. 1972 నవంబర్ 17న తిరుపతిలో జన్మించిన రోజా డాక్టర్ శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ తపస్సు’ చిత్రంతో రోజా తెరంగేట్రం చేశారు. తమిళంలో ఆర్.కె.సెల్వమణి దర్శకత్వంలో రోజా నటించిన ‘చెంబరుతి’ మంచి విజయం సాధించి, ఆమెకు నాయికగా పేరు సంపాదించి పెట్టింది.

roja-celebrates-her-birth-day-with-family-members10
roja-celebrates-her-birth-day-with-family-members10

తెలుగులో “సర్పయాగం, సీతారత్నంగారి అబ్బాయి, ముఠా మేస్త్రీ, పోలీస్ బ్రదర్స్, అన్న, శుభలగ్నం, ముగ్గురు మొనగాళ్ళు, ఘటోత్కచుడు, అన్నమయ్య, సంభవం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా” వంటి చిత్రాలలో అలరించారు రోజా. ఇక బాలకృష్ణతో రోజా జోడీ కట్టిన “భైరవద్వీపం, బొబ్బిలిసింహం, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్” చిత్రాలలో నటిగా మురిపించారామె.

roja-celebrates-her-birth-day-with-family-members9
roja-celebrates-her-birth-day-with-family-members9

‘స్వర్ణక్క’ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డును దక్కించుకున్నారు రోజా. ఇప్పటికీ అడపా దడపా తెరపై కనిపిస్తూనే ఉన్నారామె.

roja-celebrates-her-birth-day-with-family-members7
roja-celebrates-her-birth-day-with-family-members7

ఆమె న్యాయనిర్ణేతగా సాగే ‘జబర్దస్త్‌’ కార్యక్రమం విశేషంగా అలరిస్తోంది. ‘బతుకు జట్కా బండి’ వంటి కార్యక్రమాల్లోనూ రోజా తనదైన బాణీ పలికించారు.

roja-celebrates-her-birth-day-with-family-members5
roja-celebrates-her-birth-day-with-family-members5

శోభన్ బాబు కి కూతురిగా సర్పయాగం సినిమాలో నటించి మెప్పిచింది. అప్పటి నుండి రోజాకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సీతారత్నం గారబ్బాయి, ముఠామేస్త్రి , భైరవ ద్వీపం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అప్పట్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్నారు రోజా..

roja-celebrates-her-birth-day-with-family-members4
roja-celebrates-her-birth-day-with-family-members4

సినిమాలలో వచ్చిన క్రేజ్ తో రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాజీకాయాల్లో వచ్చిన కొత్తలోనే ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్నా.. ఆమెకు టైం కలసి రాలేదు. రెండు సార్లు ఎమ్మెల్యే గా ఓడిపోయారు. మొదటి టీడీపీ ద్వారా రాజకీయ ప్రవేశం ఇచ్చినా..

roja-celebrates-her-birth-day-with-family-members3
roja-celebrates-her-birth-day-with-family-members3

అధిష్టానం తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో తరువాత రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయన మరణ తరువాత.. తనయుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీలో కొనసాగుతూ.. జగన్ తనకు దేవుడిచ్చిన అన్నగా.. ఆయనకు విదేయంగా ఉంటున్నారు..

roja-celebrates-her-birth-day-with-family-members2
roja-celebrates-her-birth-day-with-family-members2

ఇటీవల మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఒకరికి ఒకే పదవి అనే కోణంలో ఆమెను ఇటీవల ఏపీఐఐసీ పదవి నుంచి తప్పించారు.. దీంతో కచ్చితంగా రోజాకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల టీంను రెడీ చేసుకుంటున్న జగన్..

roja-celebrates-her-birth-day-with-family-members1
roja-celebrates-her-birth-day-with-family-members1

కష్ట పడ్డ వారికి మంత్రి పదవులు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా రోజాకు మంత్రి పదవి కాయమని ఆమె అనుచరులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ పుట్టిన రోజు కానుకగా జగన్ త్వరలోనే ఆమెకు కేబినెట్ లో చోటు కల్పిస్తారని ఆశిస్తున్నారు.

roja-celebrates-her-birth-day-with-family-members
roja-celebrates-her-birth-day-with-family-members