Rocking Rakesh-Jordar Sujatha : స్టేజి మీదనే సుజాతకు రింగ్ తొడిగిన రాకేష్.. నుదిటిపై ముద్దు, గట్టి హగ్ తో..!
NQ Staff - January 19, 2023 / 01:32 PM IST

Rocking Rakesh-Jordar Sujatha : జబర్దస్త్.. బుల్లితెరపై ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన షో ఇది. కొన్ని సంవత్సరాల వరకు కేవలం కామెడీ ట్రాక్ తోనే అలరించిన ఈ షో.. ఆ తర్వాత బుల్లితెరపై మొదటిసారి లవ్ ట్రాక్ లను క్రియేట్ చేసింది. జబర్దస్త్ లో సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ బాగా ఫేమస్ కావడంతో ఆ తర్వాత చాలానే లవ్ జంటలు పుట్టుకు వచ్చాయి. అందులో కొన్ని కేవలం స్కిట్ల వరకు మాత్రమే పరిమితం అయితే మరికొన్ని మాత్రం నిజ జీవితంలో కూడా కొనసాగుతున్నాయి.
ఇలా నిజ జీవితంలో కూడా లవర్లుగా ఉంటున్న వారిలో ఇప్పుడు రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత కూడా ఉన్నారు. వీరిద్దరూ మొదట్లో స్నేహితులుగా స్కిట్లు చేశారు. కానీ రాను రాను ఆ స్నేహమే ఇద్దరి నడుమ ప్రేమకు దారి తీసింది. అప్పటి నుంచి చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. కానీ ఇంకా కూడా వీరిద్దరిదీ ఫేక్ లవ్ అనే కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి.
ప్రోమో చివరలో షాక్..
కానీ తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో వాటన్నింటికీ చెక్ పెట్టింది ఈ జంట. ఈ ప్రోమోలో ఎప్పటిలాగే కమెడియన్ల జోకులు, పంచులతో అలరించింది. అయితే ప్రోమో చివరలో అందరికీ షాక్ ఇచ్చారు. స్టేజి మీదనే రాకింగ్ రాకేష్ తన ప్రేయసి సుజాత వేలికి రింగ్ తొడిగాడు.
అంతే కాకుండా ఆమె నుదిటిపై ముద్దు పెట్టాడు. టైట్ గా ఒక హగ్ కూడా ఇచ్చాడు. దీంతో తామిద్దరం నిజంగానే త్వరలో పెండ్లి చేసుకోబోతున్నట్టు చెప్పకనే చెప్పేశాడు రాకేశ్. ఈ ప్రోమో చూసిన వారంతా కూడా వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.