Roar of RRR: ఆర్ఆర్ఆర్ గ‌ర్జ‌న‌.. మేకింగ్ వీడియో టైం ఫిక్స్ చేసిన మేక‌ర్స్

Roar of RRR: బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ఎవ‌రితో ఏ సినిమా చేస్తాడా అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొని ఉంది. స‌డెన్‌గా ఆయ‌న రామ్ చ‌రణ్‌, ఎన్టీఆర్ తో క‌లిసి దిగిన ఫొటో షేర్ చేశాడు. దీంతో అభిమానులు వారిద్ద‌రితో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తాడ‌ని అనుకున్నారు. అనుకున్న‌ట్టే కొద్ది రోజుల‌కు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు జ‌క్క‌న్న‌. కాల్ప‌నిక గాథ ఆధారంగా రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

Roar of RRR
Roar of RRR

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా క‌నిపంచ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా అలరించ‌నున్నారు. ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం క‌రోనా వ‌ల‌న ప‌లుమార్లు వాయిదా పడుతూ వ‌చ్చింది. అక్టోబ‌ర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల కానుందంటూ సెకండ్ వేవ్ లాక్‌డౌన్ ముందు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. కాని తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌ష్ట‌మే అని అంతా అనుకున్నారు. కాని ఆర్ఆర్ఆర్ సినిమాను అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేసేందుకు కృషి చేస్తున్నారు జ‌క్క‌న్న‌.

వీలున్న‌ప్పుడ‌ల్లా సినిమాకి సంబంధించిన ప్ర‌చార చిత్రాలు విడుద‌ల చేస్తూ ఆస‌క్తిని పెంచుతూ వ‌స్తున్న రాజ‌మౌళి తాజాగా మ‌రో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. మూవీ మేకింగ్ వీడియోని జూలై 15ఉద‌యం 11గం.ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మేకింగ్ వీడియోతో సినిమాకు సంబంధించిన క్లారిటీ అభిమానుల‌లో రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ సరసన హీందీ నటి అలియా భట్ న‌టిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ నటిస్తోంది. సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కనివిని ఎరుగని రీతిలో జరుగుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైపోయింది. ఈ సినిమాకు సంబంధించిన నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది.

పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను హోల్‌సేల్‌గా సొంతం చేసుకుంది. వీళ్లే అన్ని భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించి బిజినెస్ డీల్ పూర్తి చేసారు.