ఓంకార్ పరువు తీసేశారు.. ‘బొమ్మ అదిరింది’లో రియాజ్ రచ్చ
NQ Staff - November 12, 2020 / 12:00 PM IST

బొమ్మ అదిరింది షో రోజురోజుకు బాగా ఫేమస్ అవుతోంది. వారానికో గెస్ట్‌ను తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్‌లో వైఎస్ జగన్, చంద్రబాబు, బాలకృష్ణలా ఇమిటేట్ చేస్తూ స్కిట్స్ వేశారు. అందులో రియాజ్ అనే వ్యక్తి వైఎస్ జగన్ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేయడంతో ఏపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దెబ్బకు షో విపరీతంగా పాపులర్ అయింది. అయితే జగన్ అభిమానులు మాత్రం రియాజ్, హరి, సద్దాం వంటి వారు క్షమాపణలు చెప్పినా శాంతించలేదు.
https://www.youtube.com/watch?v=EyiDEKR2Plw
మరోసారి అలాంటి తప్పులు చేయమని క్షమించండని జగన్ అభిమానులను రియాజ్, హరి వేడుకున్నారు. ఆ వివాదం ముగిసిపోయింది. అయితే గతవారం మళ్లీ ఆ వివాదాన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. తాజాగా రియాజ్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. యాంకర్‌గా ఓంకార్ చెరగని ముద్రవేశాడు. ఆట, మాయాద్వీపంలో ఓంకార్ యాక్టింగ్, మాటలు, అవన్నీ ఓ మార్క్‌ను వేశాయి.
అదే పద్దతిలో ఓంకార్‌ను రియాజ్ ఇమిటేట్ చేశాడు. స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన పోసాని కృష్ణమురళీని కూడా ఆడుకున్నారు. పోసాని, శివ శంకర్ మాస్టర్, ఓంకార్‌లను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్ ఓరేంజ్‌లో వర్కవుట్ అయినట్టు కనిపిస్తోంది. తనలా ఇమిటేట్ చేస్తున్న వ్యక్తిని చూసి పోసాని పడి పడి నవ్వేశాడు. మొత్తానికి బొమ్మ అదిరింది షో మాత్రం రోజు రోజుకూ పాపులర్ అవుతోంది.