Ritu Varma: రీతూ వ‌ర్మ అందాల ఆరబోత చాలా కొత్తగా ఉందే..!

Ritu Varma: పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రీతువర్మ. ఈ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రీతూవర్మకు తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. తెలుగు అమ్మాయికావడంతో ఆఫ‌ర్స్ అంత‌గా రావ‌డం లేదు. ఇటీవల నానితో కలిసి `టక్‌ జగదీష్‌` చిత్రంతో ఆకట్టుకుంది రీతూ వర్మ. ఇందులోనూ ఏమాత్రం అందాలు ఆరబోయలేదు. గ్లామర్‌కి దూరంగా ఉండే రీతూ వర్మ ఇటీవ‌ల కాలంలో బోల్డ్ ఫొటో షూట్స్ చేస్తూ కేక పెట్టిస్తుంది.

Ritu Varma

రీతూ సినిమాల్లోకి రావడానికి ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. దీంతో యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన రీతూ వర్మ ఎన్టీఆర్‌ నటించిన `బాద్షా` చిత్రంతో నటిగా మారింది. ఇందులో చిన్న పాత్రలో మెరిసింది. దీని తర్వాత `ప్రేమ ఇష్క్ కాదల్‌`లో నటించి ఆకట్టుకుంది. ఇలా `నా రాకుమారుడు`, `ఎవడే సుబ్రమణ్యం` చిత్రాల్లో కనిపించింది. `ఎవడే సుబ్రమణ్యం`తో విజయ్‌ దేవరకొండతో ఏర్పడిన పరిచయం `పెళ్లిచూపులు`కు దారితీసింది.

Ritu Varma

`కేశవ`, `నిన్నిలా నిన్నిలా` చిత్రాల్లో రీతూ మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి `వెలైల్లా పట్టదారి 2`, `కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయధిథాల్‌`(కనులు కనులను దోచాయటే) చిత్రాల్లో మెరిసి విజయాలు అందుకుంది. ప్రస్తుతం `వరుడు కావలెను` చిత్రంతోపాటు తెలుగు, తమిళంలో రూపొందుతున్న `ఒకే ఒక జీవితం`లో శర్వానంద్‌ సరసన నటిస్తుంది రీతూ వర్మ.

ట్రెడిషనల్‌కే ప్రయారిటీ ఇచ్చే ఈ అందాల భామ బార్డర్స్ బ్రేక్‌ చేస్తుంది. ఘాటైన ఫోటోలను పంచుకుని ఆమె అభిమానులకు షాకిచ్చింది. తాజాగా డిఫ‌రెంట్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ అంద‌రికి షాకిచ్చింది. రీతూని ఇలాంటి డ్రెస్‌లో చూసి అంద‌రు థ్రిల్ అవుతున్నారు. చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.