Ritika Singh: కాలు జారిన రితికా.. త‌డి దుస్తుల‌లో ర‌చ్చ చేస్తున్న గురు బ్యూటీ

Ritika Singh: విక్టరీ వెంకటేష్ నటించిన ‘గురు’ సినిమా కథానాయిక, బాక్సర్ రితికా సింగ్. అందరికి గుర్తుండే ఉంటుంది. నిజ జీవితంలోనూ బాక్సరైన రితికా సింగ్ ‘ఇరుదిచుట్రు’ సినిమాతో కోలివుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో ‘గురు’గా రీమేక్ చేశారు. ఇందులోను రితికా న‌టించ‌డంతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించింది.

తమిళంలో ‘శివలింగ’, ‘ఆండవన్ కట్టలై’ సినిమాల్లో నటించింది. అవి మంచి విజయమే సాధించినా రితికాకు మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో అమ్మ‌డు అందాల ఆర‌బోత‌తో యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది. సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. తన అందమైన ఫోటోలతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్ గా మారింది రితిక.

రితిక ఒక్కోసారి శృతి మించి మ‌రీ అందాలు ఆరోబోస్తుంది. ఆ క్ర‌మంలో ప‌లు విమ‌ర్శ‌ల‌ను కూడా ఎదుర్కొంటుంది. అయితే తాజాగా ఆమె హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో నెటిజన్లను అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టినట్లుగా.. గ్లామర్ టచ్ ఇచ్చేందుకు సిద్ధం అనేలా ఆమె ఫొటో షూట్స్ ఉండటం విశేషం. నీటి కొల‌నులో జారి ప‌డ్డ రితికా ఒడ్డుకు చేరుకొని త‌డి బ‌ట్ట‌ల‌తో ఫొటో షూట్ చేసింది.

నీళ్ల‌లో ఫొటోల‌కు ఫోజులిచ్చే క్ర‌మంలో రితికా కొల‌నులో జారి ప‌డ‌గా, దానిని కూడా త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంది. ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఫుల్ వైర‌ల్ అయింది. నీటిలో తడిసిముద్దైన రితిక .. మరింత ముద్దుగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. తడి దుస్తుల్లో, పూలు పెట్టుకొని క‌నిపించిన రితికా అంద‌రి హృద‌యాల‌ను దోచేసింది.