Rishabh Shetty : ఆమెకు సంస్కారం లేదు.. రష్మికపై రిషబ్ శెట్టి దారుణమైన కామెంట్లు..!

NQ Staff - January 17, 2023 / 01:13 PM IST

Rishabh Shetty : ఆమెకు సంస్కారం లేదు.. రష్మికపై రిషబ్ శెట్టి దారుణమైన కామెంట్లు..!

Rishabh Shetty : రిషబ్‌ శెట్టి పేరు రీసెంట్ గా దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం కాంతార సినిమా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను చూసిన చాలామంది రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ సినిమా ఇంత మందిని రిషబ్‌ శెట్టికి దగ్గర చేస్తే.. రష్మికను మాత్రం దూరం చేసింది. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్‌ లో సినిమాలు చేసుకుంటూ రష్మిక చాలా బిజీగా అయిపోయింది.

ఆ సమయంలోనే కాంతార సినిమా చూశారా అంటే చూడలేదు అంటూ వెటకారంగా మాట్లాడింది. దాంతో రిషబ్ శెట్టిని అవమానించిందంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఎందుకంటే రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిర్రిక్‌ పార్టీ సినిమాతోనే ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది. ఆమెను లైఫ్ ఇచ్చిన దర్శకుడిని పట్టుకుని ఇలాంటి కామెంట్లు చేస్తుందా అని అంతా ఆడిపోసుకున్నారు.

వారితోనే సినిమా చేస్తా..

ఇక అప్పటి నుంచి రిషబ్ శెట్టి రష్మికను టార్గెట్‌ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ ఇంటర్వ్యూలలో కూడా సమంత, సాయిపల్లవి, రష్మికలలో ఎవరితో సినిమా చేస్తారని అడగ్గా.. పరోక్షంగా సమంత, సాయిపల్లవి పేర్లు చెప్పాడే గానీ రష్మిక పేరు మాత్రం చెప్పలేదు. దాంతో రష్మికకు పెద్ద రాడ్‌ దింపినట్టు అయిపోయింది.

ఇక తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు రిషబ్ శెట్టి. తాజాగా ఆయన మ్యాషబుల్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యులో మాట్లాడాడు. నేను ఎంతో మంది ఆర్టిస్టులను లాంచ్‌ చేశారు. ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు నాకు అవకాశాలు ఇచ్చారు. వారిని నేను గుర్తు పెట్టుకుంటాను. కానీ కొందరు మాత్రం గుర్తు పెట్టుకోరు అంటూ పరోక్షంగా రష్మికపై కౌంటర్లు వేశాడు రిషబ్ శెట్టి. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us