Rishabh Shetty And Vijay Devarakonda : కాంతార రిషబ్ శెట్టితో విజయ్ దేవరకొండ సినిమా.. అల్లు అరవింద్ ప్లాన్..!

NQ Staff - March 15, 2023 / 12:20 PM IST

Rishabh Shetty And Vijay Devarakonda : కాంతార రిషబ్ శెట్టితో విజయ్ దేవరకొండ సినిమా.. అల్లు అరవింద్ ప్లాన్..!

Rishabh Shetty And Vijay Devarakonda : ఎక్కడ ట్యాలెంట్ ఉన్నా సరే వెతికి పట్టుకోవడంలో అల్లు అరవింద్ బాగా దిట్ట. హిట్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇచ్చి లాభాలు పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఇప్పుడు భారీ ప్రాజెక్టును రెడీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కన్నడ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

కేవలం రూ.16 కోట్లతో రూపొందిన కాంతార.. వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లు వసూల్ చేసి దుమ్ము లేపింది. దాంతో ఈ మూవీ డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగి పోయింది. ఈ కారణంగా ఇప్పుడు కాంతార-2 సినిమాపై భారీ అంచానలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండతో రిషబ్ శెట్టి సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.

హామీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

ప్రస్తుతం విజయ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక గీతా గోవిందం-2 సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయాల్సింది. కానీ దిల్ రాజుతో అనౌన్స్ చేయడంతో అల్లు అరవింద్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ బ్యానరల్ లో మరో సినిమా చేస్తానని విజయ్ దేవరకొండ హామీ ఇచ్చాడంట.

దాంతో గతంలో కాంతార సినిమాను తెలుగులో రిలీజ్ చేసే సమయంలో రిషబ్ శెట్టితో సినిమా చేస్తానని మాటిచ్చారు అల్లు అరవింద్. కాబట్టి ఇప్పుడు కాంతార-2 తర్వాత రిషబ్ శెట్టి-విజయ్ దేవరకొండ కాంబోలో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లు అరవింద్. ఇందుకోసం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓకే అయితే మాత్రం భారీ అంచనాలు పెరగడం ఖాయం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us