Richa Gangopadhyay: స్టార్ హీరోను చెప్పుతో కొడతానంటూ ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు
NQ Staff - September 22, 2022 / 07:09 PM IST

Richa Gangopadhyay: తెలుగులో ప్రభాస్ తో మిర్చి సినిమాలో నటించడంతో పాటు పలు సినిమాలో నటించిన రిచా గంగోపాధ్యాయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె సినిమాలు చేయక చాలా కాలం అయినప్పటికీ ఆమె ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు గానే ఉందంటే ఆమె అందం మరియు అభినయం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఉన్నట్లుండి ఆమె ఎందుకు సినిమాల నుండి
దూరమైంది అనేది ఇప్పటికి చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు తాజాగా సమాధానం అన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Richa Gangopadhyay Career was Ruined Because Of That Star Hero
అదేంటంటే.. ఈ ఢిల్లీ భామ ని ఒక స్టార్ హీరో తన సినిమా షూటింగ్ సమయంలో ఇబ్బంది పెట్టాడట, ఏకంగా ఆమె కార్ వాన్ లో బలవంతంగా చొరబడి అత్యంత చెత్తగా ప్రవర్తించాడట, నీచంగా మాట్లాడాడట. ఇష్టానుసారంగా చేతులు వేసి ఆమెను శారీరకంగా ఇబ్బంది పెట్టబోయాడట. దాంతో ఆ సమయంలో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనై చెప్పు తీసుకొని కొడతానంటే వార్నింగ్ ఇచ్చిందట.
ఆ సమయంలోనే ఇండస్ట్రీలో నువ్వు ఎలా ఉంటావో చూస్తానంటూ హెచ్చరించిన ఆ హీరో అక్కడి నుండి వెళ్ళి పోయాడట. ప్రస్తుతం ఈ విషయం అందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ హీరో వల్లే రిచా గంగోపాధ్యాయ మళ్ళీ తెలుగు సినిమాలో కానీ తమిళ సినిమాలో కానీ కనిపించలేదు అంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే రిచా గంగోపాధ్యాయ ని ఇబ్బంది పెట్టిన ఆ హీరో తెలుగు వ్యక్తా లేదా తమిళ వ్యక్తా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే అమెరికాలో ఉన్న రిచా గంగోపాధ్యాయ నోరు విప్పాల్సిందే. మరి ఆమె ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.