Rhea Chakraborty: రూ. 35 ల‌క్ష‌లు ఇస్తా అన్న బిగ్ బాస్‌కి నో చెప్పిన వివాదాస్పద బ్యూటీ

Rhea Chakraborty: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత వార్త‌ల‌లోకి ఎక్కిన భామ రియా చ‌క్ర‌వ‌ర్తి. డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న రియా ఇటీవ‌ల జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. సరైన అవకాశాలు లేకపోవడంతో కెరీర్‌లో నెమ్మదించిన ఆమెకు ఓ భారీ ఆఫర్‌ వచ్చినట్లు గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్‌ని వదులుకున్నట్లు తెలుస్తోంది.

Rhea Chakraborty turned down more than Rs 35 lakh per week from 'Bigg Boss'
Rhea Chakraborty turned down more than Rs 35 lakh per week from ‘Bigg Boss’

సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా ప్రసారం కానున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ -15’. ఈ షో కోస‌ఇప్పటివరకూ ఏ కంటెస్టెంట్‌కి ఇవ్వనంతగా వారానికి రూ.35 లక్షలు పారితోషికంగా చెల్లిస్తామని టీమ్‌ తెలిపిందని గత కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, తాజాగా సదరు వార్తలపై స్పందించిన రియా టీమ్‌.

రియాకు బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్‌ వచ్చిన మాట వాస్తవమేనని.. కాకపోతే ఆమె ఫోకస్ అంతా ప్రస్తుతం సినీమాలపై ఉందని..అందుకే ఆ ఆఫర్‌ని సున్నితంగా వద్దనుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా, పలు ప్రాజెక్ట్‌ల విషయమై ఆమె త్వరలోనే బాలీవుడ్‌, దక్షిణాదికి చెందిన పలువురు దర్శకనిర్మాతలను కలవనున్నారని ఆమె టీమ్‌.

సుశాంత్‌ మరణానికి రియానే కారణం అంటూ ఆయన అభిమానులు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోస్తుంటారు. బాలీవుడ్‌ డ్రగ్‌ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చడంతో సుమారు నెల రోజుల జైలు జీవితాన్ని గడిపింది. అనంతరం బెయిల్‌పై విడుదలైన రియా ప్రస్తుతం సినీ అవకాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది.