BigBoss Jyoti: జ్యోతితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వ‌ర్మ‌.. బిగ్ బాస్ బ్యూటీ స్పందన ఏంటి?

BigBoss Jyoti: రామ్ గోపాల్ వ‌ర్మ‌కు వివాదాలు కొత్తేమి కాదు. ప్రేమ‌, పెళ్లి, అమ్మాయిలు, దేవుడి వంటి విష‌యాల‌లో సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ వివాదాలు సృష్టిస్తుంటారు. ఈ మ‌ధ్య వ‌ర్మ ఎక్కువ‌గా అమ్మాయిల విష‌యంలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అరియానాతో బోల్డ్ ఇంట‌ర్వ్యూ, అషూని విచిత్రంగా ఫొటో షూట్ చేయ‌డం, అప్ క‌మింగ్ హీరోయిన్ అన‌య సుల్తానాతో రెచ్చిపోయి డ్యాన్స్ చేయ‌డం, ఇక బిగ్ బాస్ ఫేం జ్యోతితో ఊగిపోతూ డ్యాన్స్ చేయ‌డం. వీటితో వ‌ర్మ దారుణంగా ట్రోల్ అవుతున్నారు.


RGV's Misbehaviour with Bigboss Jyoti
RGV’s Misbehaviour with Bigboss Jyoti


ట్రోల్స్‌పై స్పందించిన వ‌ర్మ‌.. మ‌నిషి బాడీలో అన్ని పార్ట్స్‌కి సమ ప్రాధాన్యత ఉంటుందని, కానీ కాళ్ళమీద పడటం అనేది వాళ్లపై ఎంత రెస్పెక్ట్ ఉందో తెలియజేసే చర్య అని అన్నారు. తాను స్వేచ్ఛగా ఉంటానని, లీగల్‌గా ఎలాంటి తప్పు చేయను కానీ సమాజం ఏదో అనుకుంటుందని తాను అస్సలు పట్టించుకోనని చెప్పారు వర్మ. చివరగా ఆ అమ్మాయికి ఇష్టం.. నాకు ఇష్టం.. మధ్యలో మీరెవ్వరు? అని తన స్టైల్లో ఆ వీడియో, అందులో చేసిన పనులను సమర్థించుకున్నారు ఆర్జీవీ.


శ్రీకాంత్ అయ్యంగార్ అనే న‌టుడు కూడా అప్పుడు అక్క‌డే ఉండ‌గా, ఆ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్ధించారు. ఆయ‌న ఎలాంటి త‌ప్పు చేయ‌రు. ఎవ‌రిని ఇబ్బంది పెట్ట‌ర‌ని పేర్కొన్నాడు. ఇక వ‌ర్మ చేసిన అసభ్యకర పనులపై జ్యోతి స్పందించారు. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఆర్జీవీ గారు ఒకరు.. ఆయన పాటలకు ఆయనతో కలిసి డ్యాన్స్ చేయకుండా ఉండలేను. అతని దర్శకత్వం పట్ల అతడికున్న మక్కువకు, టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.


ఆయనతో అలా ఉండటం నాకు గౌరవంగా అనిపించింది. ఎంతో తెలివైన మనిషి. ఎంతో మంచి మనిషి. దర్శకుడిగా, ఫిల్మ్ మేకర్‌గా, ఓ మంచి మనిషిగా అన్నింటి కంటే ఆయన సెన్సాఫ్ హ్యామర్ అంటే ఎంతో ఇష్టమని జ్యోతి చెప్పుకొచ్చారు. మొత్తానికి వారి ఇష్టంతోనే వ‌ర్మ ఇలా రెచ్చిపోయాడని తెలుస్తుంది.


ఇక రీసెంట్‌గా తను కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించానని.. తనే ఫస్ట్ లవ్ అంటూ ఆమెకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు ఆర్జీవి. ఆమె పేరు పోలవరపు సత్య అని.. ఆమె మెడిసిన్ చేసినట్లుగా చెప్పాడు. తను విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివే రోజుల్లో సత్య సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసిందని చెప్పుకొచ్చాడు.