RGV: శ్రీదేవి చ‌నిపోయిన‌ప్పుడు ఎమోష‌న్ అయిన వ‌ర్మ మ‌ళ్లీ ఇప్పుడు ఎందుకు అంత ఎమోష‌న్ అయ్యాడో తెలుసా?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మను మ‌ర మ‌నిషి అని చెప్ప‌వచ్చు. ఎందుకంటే అత‌నికి ఎమోష‌న్స్, సెంటిమెంట్స్ అనేవి పెద్ద‌గా ఉండవు. బంధాలు, బంధుత్వాల‌కు కూడా పెద్దగా ప్ర‌యారిటీ ఇవ్వ‌డు. త‌న అభిమాన న‌టి శ్రీదేవిని ఎంత‌గానో ఇష్ట‌ప‌డే వ‌ర్మ ఆమె చ‌నిపోయిన స‌మ‌యంలో కాస్త ఎమోష‌న్ అయిన‌ట్టు క‌నిపించాడు. శ్రీదేవి జ్ఞాప‌కాల‌ను కూడా నెమ‌ర‌వేసుకున్నాడు. ఇక తాజాగా వ‌ర్మ కాస్త భావోద్వేగానికి గుర‌య్యాడు. అందుకు కార‌ణం రామ్ గోపాల్ వర్మ వరుసకు సోదరుడు అయ్యే సోమశేఖర్ మృతి చెంద‌డం.

వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పలు సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకోవడం మొదలుకుని పలు విభాగాల్లో పని చేస్తూ ఉండేవాడు సోమ‌శేఖ‌ర్. నా జీవితంలో చాలా కీల‌క‌మైన వ్యక్తి సోమ‌శేఖ‌ర్ అంటూ వ‌ర్మ ప‌లుమార్లు చెప్పుకొచ్చాడు.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న సోమశేఖర్ మృతితో కాస్త భావోద్వేగానికి గురైన వ‌ర్మ .. నా జీవితంలో సోమశేఖర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. అతడిని ఖచ్చితంగా చాలా మిస్ అవుతాను అన్నాడు. సోమశేఖర్ గురించి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా స్పందించాడు. తల్లికి కరోనా సోకిన సమయంలో ఆమె కోసం పరితపించాడు. ఆమె కోసం చాలా కష్టపడ్డాడు. ఆ క్రమంలోనే సోమశేఖర్ కరోనా బారిన పడ్డాడు. త‌ల్లిని కాపాడుకున్న సోమ‌శేఖ‌ర్ తాను మాత్రం క‌రోనాను జ‌యించ‌లేక‌పోయాడు.