RGV : వర్మ ట్వీట్స్ కన్ఫ్యూజన్… నిజంగానే మెగా ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తున్నాడా?
NQ Staff - October 12, 2022 / 11:53 AM IST

RGV : మెగాస్టార్ చిరంజీవి మరియు గరికపాటి మద్య జరుగుతున్న వ్యవహారం దాదాపుగా సమసి పోయినట్లే అనుకోవాలి. నాగబాబు స్పందిస్తూ గరికపాటి వారు క్షమాపణ చెప్పాలని తమ కోరుకోవడం లేదని, ఆయన మాట్లాడిన మాట కరెక్ట్ కాదని తెలుసుకోవాలని భావిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశాడు.
నాగబాబు చేసిన వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ కాస్త చల్లారారు అని చెప్పాలి. చిరంజీవి వంటి గొప్ప వ్యక్తిని గరికపాటి ని అలా అవమానించారు అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ స్పందించాడు.
నిజమే మెగాస్టార్ వంటి గొప్ప స్టార్ ముందు గరికపాటి ఏమాత్రం క్రేజ్ లేని వ్యక్తి.. అలాంటి వ్యక్తి చిరంజీవి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మెగా ఫాన్స్ ఈ విషయంలో అస్సలు ఊరుకోవద్దు అంటూ మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే విధంగా ట్వీట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఆయన కావాలని రెచ్చగొట్టే విధంగా ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటే నిజంగానే మెగా స్టార్ కి అవమానం జరిగిందని ఆయన భావిస్తున్నాడు అర్థం కావడం లేదు అంటూ కొందరు జుట్టు పీక్కుంటున్నారు.
వర్మ నిజంగానే మెగా కాంపౌండ్ కి మద్దతుగా నిలిస్తే ఆయన తీరు మారిందా అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు. కానీ వర్మ ఏం చేసినా కూడా చాలా లోతుగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు కనుక ఇది కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన ఫ్యాన్స్ ని అవమానించడం వంటిదే అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.
అసలు విషయం ఏంటి? రామ్ గోపాల్ వర్మ ఏ ఉద్దేశ్యంతో గరికపాటిని విమర్శించాడు అనే విషయాలు తెలియాలి అంటే ఆయన ముందు ముందు వెయ్యబోతున్న ట్వీట్స్ ద్వారా తెలిసే అవకాశం ఉంది.