RGV: నా కూతురు జూలో వింత జీవిలా భావిస్తుంది..

RGV: ఆర్జీవీ అంటే ఓ క్రేజ్, తాను అనుకున్నది 100 శాతం చేయడంలో ముందుంటారు. ఇంటర్వ్యూలో కూర్చుంది ఎవ్వరైనా, ఎంతటివారైనా డోంట్ కేర్ అంటారు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన లిస్ట్ లో చేర్చుకున్న డైరెక్టర్ ఇప్పుడు డీ గ్రేడ్ సినిమాలను తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆర్జీవీ రేంజ్ కు తగిన సినిమా ప్రాజెక్ట్స్ చేయడం లేదని ఇన్నాళ్ళ తన పేరు మొత్తం పాడైపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

RGV Talks Bold about His Daughter
RGV Talks Bold about His Daughter

డిఫరెంట్ వే లో పాపులర్ అవ్వడానికి కొంతమంది అమ్మాయిలను పాపులర్ చేసేందుకు డీ అనే కంపెనీ పేరుతో ఫోటోషూట్స్ ని హైలెట్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇంతకుముందు చేసిన అరడజను సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. అలాగే ఓటీటీ వేదికలపై కూడా ఆర్జీవీ చేసిన ప్రయోగాలు కూడా ఆడియన్స్ కు తెలిసిందే.

తన సినిమాల్ని, తన సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్లను కూడా లైమ్ లైట్ లో ఉంచడానికి ఆర్జీవీ చేస్తున్న కొన్ని పిచ్చి పనులు ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ నెట్టింట్లోకి టాపిక్ వచ్చింది. మొన్నా మధ్యా ఆర్జీవీ ఒక హీరోయిన్ తొడను ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు. అలాగే వీటిపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో హాట్ యాంకర్ ఆర్జీవీని పెళ్ళి చేసుకుంటా అనగానే ఆమెను విపరీతంగా పొగిడాడు. ఇదిలా ఉండగా, ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలో నెటిజన్ ఆర్జీవీ కుటుంబం, ఆయనపై ఏ విధంగా స్పందిస్తారు. ఎలా ఉంటారు అని అడిగారు. ఆర్జీవీ అంటే చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి.. తనకు అబద్దాలు చెప్పడం అస్సలు నచ్చదు. అందుకే తన కుటుంబం చాలా కాలం తనను వదిలేసారని సమాధానం ఇచ్చారు.

ఈ విషయంలో తాను అంతగా బాధపడలేదని అన్నారు. ఉన్నంతకాలం తనను తాను బ్రతకాలనే ఉద్ధేశ్యంతోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనను స్వేచ్ఛా జీవిలా వదిలేశారని అంటున్నారు. ఆర్జీవీ కుమార్తె తనను జూలో ఉండే వింత జీవిని చూసినట్లు బావిస్తుందని స్ట్రైట్ గా ముక్కుసూటిగా విషయంలోకి వచ్చారు ఆర్జీవీ.