RGV: సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న రామ్ గోపాల్ వర్మ పోస్ట్..

RGV: తను అనుకున్నదే తాను చేస్తాడు.. ఎవర్ని లెక్క చేయడు. ఎవడైతే నాకేంటి అంటాడు. అతనెవరో కాదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ. తన సినిమాలపై క్రేజ్ ఉన్న రోజుల్లో ఆయన స్టైల్ వేరు. కానీ ఇప్పుడు వేరు. ప్రపంచం ఏమనుకున్నా.. తనకు నచ్చింది చేయాల్సిందే అనే తత్వం. తన గురించి ఎవ్వరు ఎన్ని అనుకున్నా పర్లేదు అనుకుంటాడు. ఈ మధ్య కాలంలో గ్లామర్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ అడపాదడపా పాపులారిటీ సంపాదించుకున్నారు.

లేటెస్ట్ గా ఓ ఫోటో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దానితో పాటు పలు విమర్శలకు గురవుతుంది. ఈ ఫొటోలో ఒక హీరోయిన్ తొడపై ముద్దు పెడుతూ క్రేజీ లుక్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. గతంలో ఈయన చేష్టలు చూస్తే ఔరా అనాల్సిందే. మిగతా దర్శకులకు పూర్తి బిన్నంగా ఉంటాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఈ ఫోటో పై పలు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

RGV Kiss on Sonia Naresh Thigh
RGV Kiss on Sonia Naresh Thigh

కొత్త హీరోయిన్ సోనియా నరేష్ తో దిగిన ఈ రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. విచిత్రం ఏమిటంటే ఈ ఫోటోని తీసింది మరో హీరోయిన్ నైనా గంగూలీ. కొంతమంది ఈ వయసులో ఇదేం పోయేకాలం అని కామెంట్ చేస్తే.. మరికొంతమంది ఎంతైనా రామ్ గోపాల్ వర్మ అదృష్ట వంతుడు అంటున్నారు. నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ కి అదే రేంజ్ లో.. ఘాటుగా రిప్లై ఇస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన పేరుతో ఓ డిజిటల్ మీడియాను క్రియేట్ చేసుకుని.. అందులోనే ఆయన తీసిన సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ హై గ్లామర్ డోస్ ఉన్న సినిమాలను తీస్తున్నారు. శివ లాంటి గొప్ప హిట్స్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ తన రూట్ ను మార్చుకున్నారు.