Rgv : వ‌ర్మ‌కు షాక్.. దిశా ఎన్‌కౌంట‌ర్ సినిమాకు సెన్సార్ బ్రేక్..!

Rgv :య‌దార్థ గాధ‌ల‌ను సినిమాలుగా తెర‌కెక్కించిన సంచ‌ల‌నాలు క్రియేట్ చేసే రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసును సినిమాగా తీస్తున్నాడు. దిశ కుటుంబ స‌భ్యులు ఈ సినిమా తీయోద్దని మొత్తుకున్నా, కోర్టుల‌కు వెళ్లి కేసులు వేసిన కూడా సినిమా విడుద‌ల చేస్తానంటూ మొండికేసి కూర్చుకున్నాడు. ఈ సినిమాని మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల చేయాల‌ని భావించిన వ‌ర్మ చిత్రాన్ని సెన్సార్‌కు పంపిన‌ట్టు తెలుస్తుంది. అయితే దిశ ఎన్‌కౌంటర్ సినిమాకు అనుమతి ఇవ్వడంపై బోర్డులోని మెజార్టీ సభ్యులు అడ్డు చెప్పారు.

దిశ ఎన్‌కౌంట‌ర్ చిత్రంకు అనుమ‌తి ఇవ్వ‌కూడ‌ద‌ని న‌లుగురు స‌భ్యుల బోర్డ్ బృందం భావించింది. సెన్సార్ బృందం అనుమ‌తి నిరాక‌రించ‌డంతో ఈ మూవీ రివిజ‌న్ క‌మిటీ ప‌రిశీల‌న‌కు వెళ్లింది. మ‌ళ్ళీ ఈ సినిమాను చూసాక తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన జొళ్లు శివ, జొళ్ళు నవీన్, చెన్నకేశవులు, మహమ్మద్ ఆరీఫ్ ల‌ను సినిమాలో విల‌న్‌గా చూపించార‌ని వారి వారి కుటుంబ స‌భ్యులు మొత్తుకుంటున్నారు. ఎవ‌రేమ‌నుకున్నా, ఎవరెన్ని చెప్పినా కూడా తాను సినిమా పూర్తి చేశాడు. త్వ‌ర‌లో రిలీజ్ చేస్తానంటున్నాడు.

Advertisement