RGV: లో యాంగిల్‌లో అషూని కెమెరాలో బంధించిన వ‌ర్మ‌.. పిక్ షేర్ చేసి…

RGV: వివాదాస్పద ద‌ర్శ‌కుడు వ‌ర్మ పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరింది. రోజుకొక అమ్మాయితో ర‌చ్చ చేయ‌డం, వాటికి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. ఆ మ‌ధ్య అరియానాతో బోల్డ్ ఇంట‌ర్వ్యూ ఇచ్చిన వ‌ర్మ ఆ త‌ర్వాత అషూ రెడ్డితో హంగామా చేశాడు.

బిగ్‏బాస్ బ్యూటీ అషూ రెడ్డి వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లగా, ఆ స‌మ‌యంలో వ‌ర్మ తీరు అంద‌రికి ఆగ్ర‌హాన్ని తెప్పించింది. అందుకు కార‌ణం ఆర్జీవి తన ఫోటోగ్రఫి టాలెంట్‏ను చూపించ‌డం. అషు రెడ్డి కుర్చీలో కూర్చుని ఉండగా.. వర్మ కింద కూర్చుని ఫోటో తీశాడు. దానిపై నెటిజ‌న్స్ భ‌గ్గుమ‌న్నారు. అయితే ఇదంతా జ‌రిగి మూడు రోజుల పైనే అవుతుంది.

తాజాగా వ‌ర్మ అషూ రెడ్డిని లో యాంగిల్‌లో తీసిన ఫొటో షేర్ చేస్తూ.. ఈమె అషూ రెడ్డినేనా? ఈ ఫొటో తీసిన వారెవ‌రైన మీకు తెలిస్తే, న‌న్ను కాంటాక్ట్ చేయండి ప్లీజ్ అంటూ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. దీనికి నెటిజ‌న్స్ నువ్వు మ‌హానుభావుడియ్యా అని కామెంట్ చేస్తున్నారు. రీసెంట్‌గా అన‌య సుల్తానాతో డ్యాన్స్ చేసి నానా ర‌చ్చ చేసిన వ‌ర్మ అందులో ఉంది తాను కాద‌ని చెప్పాడు. అంతేకాదు అమెరికా అధ్య‌క్షుడి మీద ప్ర‌మాణం కూడా చేశాడు.

ఇంత‌కు అషూ ఇంట‌ర్వ్యూ చేసిన వీడియో ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని నెటిజ‌న్స్ ప్ర‌శ్నిస్తున్నారు. వ‌ర్మ కొద్ది రోజుల‌గా తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. అషూ రెడ్డి త‌ర్వాత అన‌య సుల్తానాతో ర‌చ్చ చేసిన వ‌ర్మ రీసెంట్‌గా త‌న ల‌వ‌ర్‌ని ప‌రిచ‌యం చేసి వార్త‌ల‌లోకి ఎక్కాడు.

తన తొలి లవర్ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆమె పేరు సత్య. ఇప్పటికీ ఆ మగువను మరిచిపోలేకపోయిన ఈయన వెంకటేష్ , శ్రీదేవిలతో తెరకెక్కించిన ‘క్షణ క్షణం’ సినిమాలో కథానాయిక శ్రీదేవి కి సత్య పేరునే పెట్టి అభిమానాన్ని చాటుకున్నారు. అలా తను ఎంతో ఇష్టపడిన తొలి ప్రేయసి పేరును సినిమాల్లో అంతకంటే ఎక్కువ ఇష్టపడే శ్రీదేవి పాాత్రకు పెట్టుకోవడం ఆర్జీవికే చెల్లింది.