RGV-ARIYANA: ట్రెండింగ్‌లో వ‌ర్మ‌- అరియ‌నా జంట‌.. ఎక్క‌డ చూసిన వీళ్ల గురించే ముచ్చ‌ట‌

RGV-ARIYANA: ఆర్నెళ్ల కింది వరకు అరియానా అంటే ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అందరికీ ఈ భామ పరిచయమే. దానికి కారణం బిగ్ బాస్ సీజన్ 4. అందులో ఈమె చేసిన రచ్చ. టాప్ 5లో ఒకరిగా నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అరియానా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన అరియానా.. తనదైన ఆటిట్యూడ్ తో పిచ్చెక్కించింది. అక్కడ అభిమానులను సంపాదించుకుంది.

RGV-ARIYANA

మరీ ముఖ్యంగా అందాల ఆరబోతలోనూ తనకెవరూ సాటి రారు అనే స్థాయిలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా రెచ్చిపోతూనే ఉంది అరియానా. ఆ షో ఇచ్చిన క్రేజ్ బయట వాడుకుంటుంది. అవకాశాల కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా వర్మకు బాగా కనెక్ట్ అయింది అరియానా.

ప్రస్తుతం ఆయనతోనే శిక్షణ తీసుకుంటుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే అరియానాను వర్మ పూర్తిగా దత్తత తీసుకున్నాడేమో..? ఒక్కసారి వర్మ కంట్లో పడితే ఆ భామ జాతకం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. సినిమాలు హిట్టైనా.. ఫట్టైనా ఆమెకు మాత్రం వరస అవకాశాలు వస్తూనే ఉంటాయి. అసలు అరియానా వెలుగులోకి వచ్చిందే వర్మ ఇంటర్వ్యూతో. ఒకానొక ఇంటర్వ్యూలో నిన్ను బికినీలో చూడాలని ఉందంటూ ఆమెను ఫేమస్ అయ్యేలా చేసాడు వర్మ. ఆ దెబ్బతో అమ్మడికి యూ ట్యూబ్ లో పాపులారిటీ వచ్చింది. బిగ్ బాస్ వరకు వెళ్లింది.

RGV-ARIYANA

అక్కడ కూడా తన సత్తా చూపించి.. బయటికి వచ్చి తన గురువుతోనే బిజీగా ఉంటుంది. జిమ్ లో చూసినా వర్మతోనే.. బయట చూసినా వర్మతోనే అన్నట్లుగా ఈమె కాలం గడిపేస్తుంది. ఎక్కడ చూసినా కూడా వర్మ అరియానా జంట తెగ కనిపిస్తున్నారు. వీరి పేర్లు ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. అరియానాకు కెరీర్ ప్రసాదించే వరకు కూడా నిద్ర పోయేలా లేడు వర్మ. ఇప్పటికే ఆర్జీవీ మత్తులో చాలా మంది హీరోయిన్లు బిజీ అయ్యారు. తాజాగా అరియానా కూడా అదే చేయాలని చూస్తుంది. మరి ఈమె కెరీర్ ను వర్మ ఎంతవరకు సెట్ చేస్తాడో చూడాలి.