RGV : ఆర్జీవీ దిగజారుడుతనం.! అషురెడ్డితో ఇది వేరే లెవల్.!

NQ Staff - December 7, 2022 / 10:35 AM IST

RGV : ఆర్జీవీ దిగజారుడుతనం.! అషురెడ్డితో ఇది వేరే లెవల్.!

RGV : దిగజారుడుతనం.. అనే మాటకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు ఒకప్పటి సంచలన ఫిలిం మేకర్, ప్రస్తుత వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ.

తాజాగా రామ్ గోపాల్ వర్మ, బిగ్ బాస్ ఫేం అషు రెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ, అషు రెడ్డితో ఏం మాట్లాడాడు.? ఏం మాట్లాడించాడు.? అన్నది వేరే చర్చ. ఈ ఇంటర్వ్యూ పేరుతో వెకిలి చేష్టలు చేశాడు ఆర్జీవీ. కామంతో కళ్ళు మూసుకుపోవడం.. అనే విషయంలో ఆర్జీవీ వేరే లెవల్.!

కామాతురాణాం.. న భయం.. న లజ్జ..

అషు రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు ఆర్జీవీ. ఇందులో తప్పేముంది.? ఔను, తప్పేమీ లేదు. కాకపోతే, ఆమె కాళ్ళను పట్టుకుని.. ఆమె కాలి వేళ్ళను నోట్లోకి లాగేసుకున్నాడు. రాయడానికే అత్యంత అసభ్యంగా వుంది మరి.!

కానీ, ఆర్జీవీ పైత్యం అలా తయారైంది. అసలు దీన్ని అషు రెడ్డి ఎలా అంగీకరించింది.? ఆర్జీవీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇకపై అషు రెడ్డి విషయంలోనూ అంతే. దిగజారిపోవడంలోనూ కొత్త లోతుల్ని వెతుక్కుంటున్నట్టున్నారు ఈ ఇద్దరూ.

ఎలాగైతేనేం, అషు రెడ్డి పేరిప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us