RGV: కాలేజీ రోజుల్లో ప్రేమ‌లో ప‌డ్డ వ‌ర్మ‌.. ఈమె నా ఫ‌స్ట్ ల‌వ‌ర్ అని పరిచ‌యం

RGV: రాంగోపాల్ వర్మ.. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్రియేట్ చేసే సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్స్ పెడుతూ నిత్యం మీడియా నోళ్లలో నానుతుంటారీ టాలీవుడ్ టు బాలీవుడ్ డైరెక్టర్. త‌ను చేసే పోస్ట్‌ల‌పై ఎవ‌రెన్ని కామెంట్స్ చేసిన అస్స‌లు ప‌ట్టించుకోరు. ఇటీవ‌ల ఓ మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు వ‌ర్మ‌.

RGV about His First Love
RGV about His First Love

ఆ త‌ర్వాత మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మీద ఒట్టు’ అంటూ తనదైన స్టైల్‌లో ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు.

ఇక చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి చిరంజీవి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పైగా ఆ రోజు రాఖీ పండగ. అందుకే మెగా ఫ్యామిలీకి రెండు పండగలు ఒకే రోజు వచ్చినట్టు అయింది. అందుకే మెగా సోదరులు రాఖీ కట్టడానికి చిరు ఇంటికి విచ్చేసారు. ఈ శుభవేళలో అల్లు అర్జున్ లేకపోవడాన్ని రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ వేడుకలో హాజరైన వారందరూ పరాన్నీ జీవులని.. అల్లు అర్జున్ మాత్రం రియల్ మెగాస్టార్ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు.

ఈ విష‌యాల‌పై టాలీవుడ్ లో హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్న క్ర‌మంలోత‌న ఫ‌స్ట్ లవర్ అంటూ స్విమ్ సూట్ లో ఉన్న అమ్మాయి ఫొటో షేర్ చేసాడు వ‌ర్మ‌. ఆమె పేరు సత్య అని తెలియ‌జేసిన వ‌ర్మ‌… విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో తామిద్దరం లవర్స్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె యూఎస్‌లో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తుందని తెలిపారు.

ఆ రోజుల్లో మెడికల్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయి. ఆ స‌మ‌యంలో ఆమెని ఇష్ట‌ప‌డ్డాను. కాని ఆమె అందంగా, డ‌బ్బులు ఉన్న వ్య‌క్తి కార‌ణంగా న‌న్ను ప‌ట్టించుకోలేదని భావించాను. ఈ కార‌ణంగానే నేను రంగీలా స్టోరీ రాసుకున్నాను అని వ‌ర్మ పేర్కొన్నాడు. అయితే వ‌ర్మ గార్ల్ ఫ్రెండ్ చాలా హాట్‌గా బీచ్‌లో తెగ ఎంజాయ్ చేస్తుండ‌డాన్ని చూసిన నెటిజ‌న్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.