RENU DESAI: రోజులో 18 గంటల పాటు కరోనా రోగులకు సాయం చేస్తున్న రేణూ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్
Samsthi 2210 - May 22, 2021 / 11:02 AM IST

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారిన పడి రోజుకు వేలలో చనిపోతున్నారు. సమయానికి ఆక్సీజన్ అందక.. మెడిసిన్స్ అందక.. ఆసుపత్రి బెడ్స్ ఖాళీ లేకపోవడంతో తుదిశ్వాస విడుస్తున్నారు. అయితే కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో సినీ రంగానికి చెందిన వారు సోషల్ మీడియా ద్వారా సహాయం గా నిలుస్తున్నారు. సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందు ఉండే రేణూ దేశాయ్ కూడా సహాయ కార్యక్రమాలు అందించేందుకు ముందుకు వచ్చింది. హెల్ప్ లైన్ ను ఓపెన్ చేసి ఏ అవసరం ఉన్నా కూడా తనకు కాల్ చేయాలంటూ రేణూ దేశాయ్ పేర్కొన్నారు.

Renu Desai
కొద్ది రోజులుగా రేణూ దేశాయ్ తనకు వస్తున్న కాల్స్, మెసేజెస్‌ను పరిశీలిస్తూ అవసరమైన వారికి తన టీమ్ ద్వారా సాయం అందేలా చేస్తుంది. ప్రస్తుతం రేణూకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతూ పోతుంది. సోషల్ మీడియా లేదంటే హెల్ప్ లైన్ ద్వారా ఎవరైన సాయం అడిగారంటే వెంటనే ఏదో ఒకలా స్పందిస్తుందట రేణూ. దాదాపు 18 గంటలు పని చేసుకుంటూ , సమాచారాన్ని షేర్ చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి సాయంగా రేణు దేశాయ్ నిలుస్తున్నారు. ఈ విషయంలో తనకు చాలా మంది దాతలు సహాయంగా నిలుస్తున్నారంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
రోజుకు ఒక్కరికి అయిన మనం సాయం చేస్తే ఆ ఆనందమే వేరు. నేను చేస్తున్న సాయం జస్ట్ ఫోన్ లో సమాచారంను షేర్ చేసుకోవడం. ఇది ఎలాంటి సాయమో నాకు తెలియదు. కాని చాలా మందికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు. కరోనా కాలంలో రేణూ దేశాయ్‌నే కాదు నిఖిల్, సోనూసూద్ వంటి సెలబ్రిటీలు సైతం సాయాలు చేసుకుంటూ వెళుతూ అందరి మన్ననలు పొందుతున్నారు.