RENU DESAI: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో దిగిన ఫొటోని షేర్ చేసిన రేణూ దేశాయ్.. ఏ చికితా అంటూ క్యాప్ష‌న్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు రేణూ దేశాయ్ న‌టించిన తొలి చిత్రం బ‌ద్రి విడుద‌లై 21 ఏళ్లు పూర్త‌వుతుంది. ఈ సంద‌ర్భంగా రేణూ దేశాయ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ఎండ నుండి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చున్నీని స‌న్‌స్క్రీన్‌గా ఉప‌యోగించిన‌ట్టు కామెంట్ పెట్టింది. ఏ చికితా అనే ప‌దాన్ని కూడా త‌న కామెంట్‌కు త‌న చేసింది. ఈ సినిమా స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్ ల మ‌ధ్య ప్రేమ పుట్టిన సంగ‌తి తెలిసిందే.

బ‌ద్రి సినిమా స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్‌ల మ‌ధ్య ప్రేమ చిగురించ‌గా, కొంత కాలం పాటు వారు స‌హ‌జీవ‌నం చేశారు. అనంత‌రం పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు అకీరా, ఆద్య అనే చిన్నారులు ఉన్నారు. అప్పుడ‌ప్పుడు త‌న పిల్ల‌ల ఫొటోల‌ను రేణూ దేశాయ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌కు వినోదాన్ని పంచుతుంది. అకీరా రాబోయే కాలానికి కాబోయే జూనియ‌ర్ పవ‌ర్ స్టార్ అని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.

Advertisement