Renu Desai: గర్వంగా ఉంది.. అకీరా నందన్‌ పై రేణూ దేశాయ్ కామెంట్స్

Renu Desai అకీరా నందన్ ఎప్పుడూ కూడా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపిస్తాడు. ప్రపంచం అంతా ఒక వైపు తాను మాత్రం ఒక వైపు అన్నట్టుగా ఉంటాడు. పవన్ కళ్యాణ్‌లానే అందరితో ఈజీగా కలవలేడు. అలాంటి అకీరా నందన్ అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంటాడు. ఆ విషయాలన్ని రేణూ దేశాయ్ చెబుతూ ఉంటుంది. అయితే అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ మొత్తం దైవ దర్శనానికి వెళ్లింది.

అలా బర్త్ డే స్పెషల్‌గా పంచెకట్టులో కనిపించాడు అకీరా నందన్. పంచెకట్టు గురించి రేణూ దేశాయ్‌ను అకీరా ప్రశ్నించాడట. ఆడవాళ్లు చీరకట్టుకుంటే ఎవ్వరూ అంత వింతగా చూడరు కానీ.. మగవారు మాత్రం ఇలా ధోతీలు కట్టుకుంటే చూస్తారు ఎందుకు? ఇవి కేవలం పండుగలు, గుళ్లకు వచ్చినప్పుడే కట్టుకోవాలా? అని అడిగాడట. దానికి రేణు దేశాయ్ఇచ్చిన వివరణ, వాటిని అకీరా నందన్ పాటించే తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

గర్వంగా ఉంది.. అకీరా నందన్‌ పై రేణూ దేశాయ్ కామెంట్స్

మనకు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలాంటివి ధరించవచ్చు. ధోతి కట్టుకోవడమే మన సంప్రదాయం. అవి ధరించడాన్ని వింతగా చూడకండి.. ప్రతీ రోజూ అవి కట్టుకోవచ్చు. జీన్స్, షార్ట్స్ ధరించకుండా ప్రతీ రోజూ అకీరా ధోతి, లుంగీలను కట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నాడు. అయినా కూడా వెస్ట్రన్ కల్చర్‌ను గుడ్డిగా నమ్మి మన సంప్రదాయాలను పక్కన పెట్టకుండా.. మన సంప్రదాయ దుస్తులను ధరించడం గర్వంగా ఫీల్ అవ్వండి.. నువ్ నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తున్నావ్ అకిరా అంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)

Advertisement