Renu desai : ‘అవును.. నేను ప్రేమలో ఉన్నాను’ అని అఫిషియల్ గా చెప్పిన రేణూ దేశాయ్ ప్రకటనపై పవన్ స్పందన ఇదే?

Renu desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఆ ముగ్గురి భార్యల్లోకెల్లా రేణూ దేశాయ్ పేరే ఎక్కువ మందికి తెలుసు. ఆమె హీరోయిన్ కావటం ఒక కారణమైతే, పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక కూడా వాళ్లిద్దరి గురించి మీడియావాళ్లు రోజూ ఏదో ఒక న్యూసో, గాసిప్పో రాస్తుండటం మరో కారణం. ఆ క్రమంలోనే ఇవాళ కూడా అలాంటిదే ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

ప్రేమ.. లవ్..

పవర్ స్టార్ రెండో మాజీ భార్య అయిన రేణూ దేశాయ్ లవ్ లో ఉన్నారట. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియాలో అఫిషియల్ గా ప్రకటించారు. కానీ దాన్ని మీడియావాళ్లు ఉన్నది ఉన్నట్లు చెప్పరు కదా. ఏదో మసాలా కలిపి కొడుతున్నారు. ఉన్నదీ లేనిదీ కలిపి రాస్తున్నారు. అయితే.. నిజానికి ఆమె ప్రేమించేది వ్యక్తిని కాదు. జంతువుని. నేను లవ్ చేస్తోంది నా పెట్ డాగ్ ఫ్లూటోని అని రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక పిక్ ని కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఎక్కడున్నారు?: Renu desai

రేణూ దేశాయ్ ఎక్కడున్నా రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఆమె వాస్తవానికి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నాక రేణూ దేశాయ్ పుణేలో సెటిల్ అయ్యారట. అక్కడి నుంచే తనకు సంబంధించిన అన్ని పనులనూ చక్కబెట్టుకుంటున్నారట.

Renu-desai-officially-announced-that-she-is-in-love
Renu-desai-officially-announced-that-she-is-in-love

రెడీ టూ..

రేణూ దేశాయ్ ప్రస్తుతం తన కెరీర్ లో రెండో ఇన్నింగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంటుగా పలు తెలుగు ఛానళ్లలో వివిధ ప్రోగ్రామ్స్ చేసిన రేణూ ఓటీటీ ప్లాట్ ఫాంలతోపాటు సినిమాల్లోనూ మెరిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో కాస్త బిజీ అయ్యారనే చెప్పాలి. కానీ.. తీరిక దొరికినప్పుడల్లా తనలోని హ్యుమానిటీని మూగజీవాలకు పంచుతూ, సంబంధిత ఇమేజ్ లను, వీడియోలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. రేణూ దేశాయ్ స్వతహాగా జంతు ప్రేమికురాలు కావటం ఆమెలో పవన్ కళ్యాణ్ కి నచ్చే అంశాల్లో ఒకటి. అందువల్ల ఆయన రేణూ దేశాయ్ ఇచ్చిన ఈ లేటెస్టు అప్డేట్ పై పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారంట.

Advertisement