Renu Desai: రేణూదేశాయ్, అకీరాకి క‌రోనా పాజిటివ్.. మాస్క్‌లు ధ‌రించాలంటూ సూచ‌న‌

Renu Desai: దేశంలో క‌రోనా గుబులు రేపుతుంది. చాపకింద నీరులా రోజురోజుకీ ఈ వైర‌స్ తన ఉనికి పెంచుకుంటూ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తేడా లేకుండా క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతుంది. టాలీవుడ్, బాలీవుడ్‌లో క‌రోనా కలకలం సృష్టిస్తోంది.

renu desai gets corona1
renu desai gets corona1

ఇప్పటికే అర్జున్ కపూర్‌, కరీనా కపూర్‌, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్‌, మృణాల్‌ ఠాకూర్‌, ఏక్తా కపూర్‌, అలయ ఎఫ్‌, అర్జున్ బిజ్లానీ, డెల్నాజ్‌ ఇరానీ, ప్రేమ్‌ చోప్రా వంటి పలువురు బీటౌన్‌, టీవీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోను క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.

టాలీవుడ్‌లో మంచు లక్ష్మీ, మ‌నోజ్, మ‌హేష్ బాబు, రాజేంద్ర ప్ర‌సాద్ ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా రేణూదేశాయ్‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని రేణూ స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

renu desai gets corona3
renu desai gets corona3

మేం అంతా కూడా ఇంట్లోనే ఉన్నాం. న్యూ ఇయర్‌కి కూడా ఇంట్లోనే ఉన్నాం. అకీరా, నాకు కొద్ది రోజుల క్రితం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇద్ద‌రం క్ర‌మ‌క్ర‌మంగా కోలుకుంటున్నాం. ప్ర‌తి ఒక్క‌రు థ‌ర్డ్ వేవ్ చాలా సీరియ‌స్‌గా తీసుకోండి. మాస్క్ ధ‌రిస్తూ జాగ్ర‌త్త‌గా ఉండండి. అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దాం అని అనుకునే స‌మ‌యంలో క‌రోనాగా నిర్ధార‌ణ అయింద‌ని రేణూ పేర్కొంది.

గ‌త ఏడాది రేణూ దేశాయ్ కి క‌రోనా వ‌చ్చినట్టు సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఆమె స్పందించింది. త‌నకు నిజంగానే కరోనా వచ్చిందనే వార్తలతో మార్నింగ్ నుంచి ఫ్రెండ్స్, సన్నిహితులు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారంది. ఒక ఫంక్షన్‌కు వెళితే అదోలా చూశారని, తనకసలు బాధ్యత లేని మనిషిగా అన్నట్లుగా చూపులతో గుచ్చారంది. ద‌య‌చేసి త‌ప్పుడు వార్తలు పుట్టించ‌కండ‌ని కోరింది.