RENU DESAI: పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. రేణూ దేశాయ్ సేవ‌ల‌కు అడ్డుప‌డుతున్న కొంద‌రు వ్య‌క్తులు

రేణూ దేశాయ్ క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. అయితే కొందరు త‌ను చేస్తున్న ప‌నుల‌కు అడ్డుగా నిలుస్తున్నారు. దీనిపై రేణూ దేశాయ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హాయ్ , ఎలా ఉన్నారు వంటి మెసేజ్‌లు త‌ర‌చు వ‌స్తుండ‌డంతో విసుగు చెందిన రేణూ పిచ్చి పిచ్చి మెసెజ్‌లు చేయకండని కోరింది. అయిన కూడా కొందరు వినడం లేదు. అలాంటి సందేశాలతో అత్యవసరంలో ఉన్న కొంత మందిని మిస్ అయ్యే అవకాశం ఉంటుందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.

చేసిన వాళ్ల‌కే సాయం చేస్తున్నారంటూ కూడా కొంద‌రు నెటిజ‌న్స్ ఆమెపై విమ‌ర్శ‌లు చేశారు. దీనిపై స్పందించిన రేణూ కొన్ని సార్లు మెసెజ్‌లు చూడలేకపోవచ్చు.. అయినా నేను సాయం చేయలేకపోతే మీరు నన్ను అడిగే హక్కు మీకు లేదు.. నేనేమీ మీరు ఓట్లు వేసి గెలిచిన నాయకురాలిని కాదంటూ ఘాటుగా స్పందించారు. తాజ‌గా ఆర్థిక సాయం చేయండంటూ తనకు మెసెజ్‌లు వస్తున్నాయని, తాను అసలు ఆర్థిక సాయం చేయలేనని, ఫుడ్, మెడిసిన్స్ వరకు సాయం చేయగలనని చెప్పుకొచ్చారు. కొందరు ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని బెదిరిస్తున్నారు. ఇలాంటి మెసేజ్ చేస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రేణూ దేశాయ్ వార్నింగ్ ఇచ్చారు.