Renu Desai Filed Petition In High Court : హైకోర్టులో రేణు దేశాయ్ పిటిషన్.. ఆ విషయంలోనే ఈ భామ సీరియస్.. అసలేం జరిగిందంటే?
NQ Staff - August 5, 2023 / 08:44 PM IST

Renu Desai Filed Petition In High Court :
హీరోయిన్ రేణు దేశాయ్ అంటే తెలియని వారు లేరు.. ఈమె హీరోయిన్ గా మాత్రమే కాదు.. దర్శకురాలిగా కూడా సుపరిచితమే.. మరి అలాంటి భామ తాజాగా కోర్టు మెట్లు ఎక్కారు.. హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే..
ఈ విషయం లోనే రేణు దేశాయ్ కోర్టుకు వెళ్లినట్టు తెలుస్తుంది.. ప్రభుత్వం ఈ ఆక్వా మెరైన్ పార్క్ ను నగర శివార్లలోని కొత్వాల్ గూడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.. మరి దీనిని ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ప్రకృతి విధ్వంసం జరుగుతుందని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది..
రేణు దేశాయ్ తో పాటు మరికొంత మంది సినీ సెలెబ్రిటీలు కూడా హైకోర్టు మెట్లు ఎక్కారు.. ఆక్వా మెరైన్ పార్క్ ను ఆపాలంటూ పోరాడుతున్న సెలెబ్రిటీలలో సదా, శ్రీ దివ్య, డైరెక్టర్ శశికిరణ్ తిక్కా తదితరులు ఉన్నట్టు తెలుస్తుంది.. ఆక్వా మెరైన్ పార్క్ పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని.. వెలది జలచరాలు మనుగడకు దీని ద్వారా ముప్పు వస్తుందని ఆహ్లాదం కోసం వాటిని మన ముందుకు తీసుకు వస్తే వాటి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని అంటున్నారు..
అంతేకాదు కృత్రిమంగా చేసిన లైట్స్ కారణంగా వాటి జీవనం అత్యంత బాధాకరంగా ఉంటుందని వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ పార్క్ వల్ల నీటి కొరత కూడా ఏర్పడుతుందని అంటున్నారు.. చాలా దేశాలు ఇలాంటి పార్కుల నిర్మాణాలను వ్యతిరేకించగా మన దగ్గర మాత్రం ఎలా ఆమోదం తెలుపుతున్నారని వారు ప్రశ్నిస్తూ ప్రజావ్యాజ్యం దాఖలు చేసారు.. ఈ మ్యాటర్ ఎంత వరకు వెళుతుందో.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే..