Renu Desai: 15 నిమిషాల ఆనందం కోసం నేను ఆ ప‌ని చేయ‌ను..రేణూ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

NQ Staff - September 1, 2021 / 09:39 AM IST

Renu Desai: 15 నిమిషాల ఆనందం కోసం నేను ఆ ప‌ని చేయ‌ను..రేణూ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Renu Desai: సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ త‌న ఫ్యామిలీ విష‌యాల‌తో పాటు స‌మాజానికి సంబంధించిన విష‌యాల‌ను షేర్ చేస్తూ ఉంటుంది.ఆ మ‌ధ్య త‌న కుమారుడు క‌ర్ర‌సాము వీడియో షేర్ చేసి నెటిజ‌న్స్ తెగ ఆనందింప‌జేసింది. అలానే త‌న అందం, అభిన‌యంకి సంబంధించి నెటిజ‌న్స్ వేసిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌రదాగా స్పందించింది.

Renu Desai Emotional Post about Why she is Vegan

Renu Desai Emotional Post about Why she is Vegan


తాజ‌గా రేణూ దేశాయ్ జంతు హింస‌కు సంబంధించి స‌ర్‌ప్రైజింగ్ పోస్ట్ పెట్టింది . జంతు హింస న‌చ్చ‌ని చాలా మంది మాంసాహారుల నుండి శాఖాహారులుగా మారుతున్నారు. ఆ మధ్య ఆహా భోజనంబు షోలో ఆలీ గెస్టుగా వచ్చారు. తన భార్య మటన్ తినడం మానేసిందని దాని వెనుకున్న కథను చెప్పుకొచ్చారు.

Renu Desai Emotional Post about Why she is Vegan

Renu Desai Emotional Post about Why she is Vegan


ఓ సారి మేకను ముక్కలు ముక్కలుగా కట్ చేయడం చూసిందని అప్పటి నుంచి మటన్ తినడం పూర్తిగా మానేసింద‌ని ఆలీ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు రేణూ దేశాయ్ కూడా రియ‌లైజ్ అయిన‌ట్టు తెలుస్తుంది. జంతు పరిరక్షణకు సంబంధించిన ఓ సంస్థ చేసిన పోస్ట్‌ను రేణూ దేశాయ్ తిరిగి షేర్ చేస్తూ తాను కూడా శాఖాహారిగా మారింద‌నే అభిప్రాయాన్ని చెప్ప‌క‌నే చెప్పింది.

నేను శాఖాహారిగా ఎందుకు మారిపోయాను?.. ఎందుకంటే.. ఓ జంతువు జీవితకాలం మొత్తాన్ని, దాని భయం, దాని బాధ, నొప్పి ఇవన్నీ కూడా కేవలం నా పదిహేను నిమిషాల సుఖం, సంతోషానికి సరితూగదు అని తెలుసుకున్నాను. ఆ విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను. అంటూ ఆ పోస్ట్ సారాంశాన్ని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. ప‌దిహేను నిమిషాల ఆనందం, సుఖం కోసం ఇలా చేస్తున్నాను అంటూ రేణూ చెప్ప‌డం విశేషం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us