Pushpa: భ‌యంక‌రంగా ఉన్న పుష్ప విల‌న్.. ఇక ప్ర‌క‌పంన‌లే..!

Pushpa: సినీ ప్రియులంద‌రు బ‌న్నీసినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అల వైకుంఠ‌పుర‌ములో సినిమా త‌ర్వాత బ‌న్నీ పుష్ప అనే చిత్రం కోసం మాస్ లుక్‌లో క‌నిపిస్తుండ‌డంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌‌‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

Pushpa

బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియో రికార్డులు సృష్టించ‌డ‌మే కాక‌, సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. అలాగే ఈ సినిమాలో బన్నీ ముగ్గురు విలన్‌‌‌లతో పోటీపడనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక విలన్‌‌‌‌గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌‌‌‌ను ఫిక్స్ చేశారు. ఫహద్ అటు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గాను మెప్పిస్తున్నారు.

ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప టీమ్ ఆయనకు విషెస్ తెలియ‌జేస్తూ.. ఆసక్తికర పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌‌‌‌లో `ఈవిల్ ఎప్పుడూ అంత ప్రమాదకరమైనది కాదు!!’ అని ఉంది మధ్యలో ఫహద్ కన్ను ఉండేలా డిజైన్ చేశారు. ఈ పోస్ట‌ర్ ఎంతో ఆక‌ట్టుకుంది. ఇక తాజాగా ఫ‌హ‌ద్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ అధికారిగా.. కంటిచూపుతోనే అందర్నీ గజగజ వణికించేలా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు.

చిత్తూరు నేపథ్యంలో అక్కడి యాసతో ఈ సినిమా సాగనుండ‌గా, రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గిరిజన యువతిగా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది. పుష్ప సినిమాకి సంబంధించి చాలా ప్ర‌చారాలు న‌డుస్తుండ‌గా, ఇందులో ఏది నిజం ఏది అబ‌ద్ధం తెలియ‌క అభిమానులు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు.