నేను జనాల మధ్య లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను.

Advertisement

ప్రతి అమ్మాయి వారి జీవితాలలో ఏదో ఒక పరిస్థితులలో లైంగిక వేధింపులు ఎదొర్కొవాల్సి వస్తుంది. అది అందరూ నమ్మాల్సిన నిజం. నేను నా చిన్నతనం లో మరియు ఇటీవల కాలం లో అలంటి పరిస్థులని ఎదొర్కొన్నాను. నిజం చెప్పాలంటే వాటి వల్లనేమో నేను ఈ రోజు ప్రతి కష్టాన్ని ఎదురుకొని ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నాను. ఇవన్నీ అన్నది ఎవరివో కాదు ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా.

అసలేం జరిగింది తాను ఏ పరిస్థితులు ఎదుర్కొంది. తన జీవితం లో జరిగిన ఘటనలు ఏమిటి అన్న వివరాల్లోకి వెళ్తే. రెజీనా కసాండ్రా తెలుగులో సుధీర్ కి జంటగా ఎస్ఎంఎస్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయి తొలి సినిమాతో నే మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత కొత్తజంట, జ్యో అచుతానంద, శౌర్య, రొటీన్ లవ్ స్టోరీ, పిల్ల నువ్వు లేని జీవితం, ఆ, ఎవరు, ఇలా తేలుగు లో ఎన్నో సినిమాలను చేసి ప్రేక్షకులు మరింత దగ్గరవ్వడమే కాకుండా ఓక స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సంపాదించుకుంది.

అయితే ఈ మధ్య కలం లో తాను ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గురించి మరియు తన లైఫ్ గురించి చెప్తూ మీరు పరిశ్రమ లో ఏవైనా కష్టమైనా పరిస్థితులని ఎదురుకున్నారా అన్న ప్రశ్నకి. నిజం చెప్పాలంటే కేవలం సినిమాల్లోనే కాదు ప్రతి అమ్మాయి వారి జీవితాల్లో ఏదో ఒక సందర్భం లో లైంగిక వేధిపులకి లేదా సమస్యలని అనుభవిస్తూ ఎదుర్కుంటూ వస్తుంది. ఆలా నా జీవితం లో వేధింపులు చిన్న వయసులోనే మొదలయ్యాయి.. నేను కాలేజీ చదివే రోజుల్లోనే కొంతమంది అబ్బాయి లు నన్ని ఎంతగానో వేధించే వారు. ఇంకా ఆతరువాత కొంత కాలం క్రితం నేను చెన్నై లోని ఒక సినిమా హాల్ కి వెళ్ళినప్పుడు కొంతమంది కుర్రవాళ్ళు ఎంతో అసభ్యకరమైన కామెంట్ లు వేస్తూ నా చుట్టే తిరిగారు వారి లో ఒకడు అయితే ఏకంగా కొన్ని చోట్ల పట్టుకొనే ప్రయత్నం చేసాడు.

అయితే ఇలాంటి ఇన్సిడెంట్ లు మన చుట్టూ జరుగుతుంటాయి. ప్రతి అమ్మాయి విషయం లో ఇలాంటివి తప్పదు అని గ్రహించి నేను వాటికి భయపడకుండా ఎదొర్కొని ఎలా పోరాడాలి. అని నేర్చుకున్నాను. వాటి వళ్ళ నాలో ధైర్యం పెరిగిందీ కానీ పరిస్థితులకు బయపడి నేను వెనిక్కి తగ్గలేదు. ప్రస్తుతం చాల మంది అమ్మాయి లు కూడా వాటిని తట్టుకొని ఎదొర్కొని పోరాడలేక వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఆలా ఇళ్లకే పరిమితం అయినా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి విషయాలు జరిగితే ఇక మీద నైనా అమ్మాయి లు ఎలా ఎదొర్కొవాలి మనలో ఎలాంటి ధైర్యాన్ని నింపుకోవా లో తెలుసుకొని ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను అని తన జీవితం లో జరిగిన ఘటనలు తెలియచేస్తూనే మిగిలిన వారికి సందేశాన్ని అందించే ప్రయత్నాన్ని చేశారు..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here