Regina: డబ్బులు కోసం ఇలాంటి చీప్ ప‌నులు చేస్తావా అంటూ రెజీనాపై ఆగ్ర‌హం

Regina: సినిమా ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా మాయమైన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అందులో రెజీనా కూడా ఒక‌రు. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. త్వరలోనే ఈ బ్యూటీ నేనేనా అనే హారర్ సినిమాలో నటిస్తుంది.

Regina Cassandra Promotes Signature Brand
Regina Cassandra Promotes Signature Brand

ఈ అమ్మడు ఓ క్రేజీ వెబ్ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. బాలీవుడ్‌లో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లో ఓ హీరోయిన్‌గా రెజీనా కాసాండ్రాను ఎంపిక చేశారని తెలుస్తుంది. రాజ్ – డీకే లు వరుసగా బాలీవుడ్‌లో సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ లను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో హీరోగా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు

అయితే స‌రైన ఛాన్స్‌లు లేక ఇబ్బందులు ప‌డుతున్న భామ‌లు దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్టుకోవాల‌ని అనుకుంటున్నారు. అందుకోసం ఇతర ప్రొడక్ట్‌లకు అంబాసిడర్‌గా ఉంటూ జనాల వీక్ నెస్‌తో ఆడుకుంటున్నారు.ఈ క్ర‌మంలో విమ‌ర్శ‌ల బారిన కూడా ప‌డుతున్నారు.

తాజాగా టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా కూడా ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అయితే దానిపై నెటిజన్లు పెద్దఎత్తున ఫైర్ అవుతున్నారు.

తనకు తొమ్మిదేళ్ళ వయసు ఉన్నప్పుడే యాంకరింగ్ ప్రారంభించాలని.. ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తారని ఈ సంతోషాన్ని సిగ్నేచర్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని తెలిపింది. సిగ్నేచర్ బ్రాండ్ ఆల్కహాల్ కు ఈమె బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరిగింది. దీంతో దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

కేవలం డబ్బు కోసమే ఇలాంటి హానికరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారంటూ నెటిజన్లు ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే తన పద్ధతి బాగా లేదని.. డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.