Regina Cassandra: మేకప్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్లి బుక్కయిపోయిన హీరోయిన్.!

NQ Staff - September 21, 2022 / 04:40 PM IST

159913Regina Cassandra: మేకప్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్లి బుక్కయిపోయిన హీరోయిన్.!

Regina Cassandra: హీరోయిన్‌గా ‘ఎస్ఎమ్ఎస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రెజీనా కసండ్రా. ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తదితర చిత్రాలతో పాపులర్ అయ్యింది. ‘ఎవరు’ వంటి ఇన్నోవేటివ్ చిత్రాల్లోనూ నటించి నటిగా తనదైన ముద్ర వేయించుకుంది రెజీనా.

తాజాగా రెజీనా నటించిన ‘శాకినీ ఢాకినీ’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఓ మోస్తరు ప్రశంసలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా రెజీనా తన కెరీర్‌లో గతంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.

హీరోయిన్లకు మేకప్ అంత ఇంపార్టెంటా.?

Regina Cassandra Appeared Radio Interview without Make up

Regina Cassandra Appeared Radio Interview without Make up

కెరీర్ మొదట్లో తనకు చాలా తక్కువ రెమ్యునరేష్ ఇచ్చేవారనీ, ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి.. ఏ ఏ డేట్స్ ఇవ్వాలన్న విషయాలన్నీ తన తల్లి దగ్గరుండి చూసుకునేదనీ, అప్పట్లో తనకు పర్సనల్ మేకప్ అసిస్టెంట్ కూడా వుండేవాళ్లు కాదనీ చెప్పింది.

కెరీర్ మొదట్లో అలాగే వుంటుంది కదా. ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా, జస్ట్ తల స్నానం చేసి, హెయిర్ కూడా డ్రై చేసుకోకుండా, అలాగే ఇంటర్వ్యూకి వెళ్లిపోయిందట రెజీనా. అదో రేడియో ఇంటర్వ్యూ అట. అయితే ఆ ఇంటర్వ్యూ తర్వాత ఫోటో సెషన్ జరిగిందట.

మేకప్ లేకుండా వెళ్లడంతో ఆ ఫోటోల్లో తాను అసలు హీరోయిన్‌లాగే కనిపించదట. ఆ ఫోటోలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో వున్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది రెజీనా. ఆ తర్వాత నుంచి ఇంకెప్పుడూ మేకప్ లేకుండా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టలేదనీ రెజీనా కసండ్రా చెప్పుకొచ్చింది.