Prabhas: తన పెళ్ళిపై మాస్టర్ ప్లాన్ చేసిన యంగ్ రెబల్ స్టార్..

Prabhas యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ కు సినీ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా తెలుగు సినిమా రేంజ్ ని అమాంతం పెంచేశారు. ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇక ప్రభాస్ పెళ్ళి విషయమే ఓ పెద్ద ప్రశ్నగా మారింది.

TheNewsQube-

ఈ క్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజును ప్రేక్షకులు ఎన్నో సందర్భాల్లో అడిగినా.. అది పూర్తిగా ప్రభాస్ నిర్ణయం అని తనకు నచ్చినప్పుడు పెళ్ళి చేసుకుంటానని అన్నారు. ఇంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రభాస్ ను పెళ్ళి చేసుకోమని బ్రతిమిలాడుతున్నారట. అందుకే ప్రభాస్ తన పెళ్ళి విషయంలో మాస్టర్ ప్లాన్ చేశారు.

గతంలో బాహుబలి సినిమా పూర్తి చేశాక తప్పకుండా పెళ్ళి చేసుకుంటానని తెలిపి.. ఆ తర్వాత కరోనా కారణంగా ప్రస్తుతం పెళ్ళి చేసుకోవడం అంత మంచిది కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అయ్యాక పెళ్ళి చేసుకుంటానని అంటున్నారు. ప్రజంట్ ప్రభాస్ చేయాల్సిన వరుస సినిమాలు పూర్తవ్వాలంటే దాదాపుగా 5 ఏళ్ళు పడుతుంది.

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ అయిపోయి.. రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నెక్ట్స్ సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలు కూడా వచ్చే సంవత్సరం సమ్మర్ కు రిలీజ్ అవుతాయి. ప్రభాస్ సినిమా లిస్ట్ లో నాగ్ అశ్విన్ తో కలిసి ప్రాజెక్ట్ కె సినిమా కోసం దాదాపు 3 ఏళ్ళు పడుతుందట. ఎందుకంటే ఈ సినిమాకి ఐదు వందల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధం అయ్యారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమాని ఓకే చేశారు.

ఈ సినిమాలన్నీ ఎప్పుడూ కంప్లీట్ అవ్వాలి.. ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి. అందుకే ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ను ఎక్కువగా డిస్టర్బ్ చేయడం లేదట. ఏది ఏమైనా ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరిగితేనే బావుంటుందని అనుకుంటున్నారు నెటిజన్లు.