Reba Monica John Wants To Date Star Hero : ఆ స్టార్ హీరోతో డేట్ కు వెళ్తే తప్పులేదు.. సామజవరగమన హీరోయిన్ కామెంట్స్..!

NQ Staff - August 2, 2023 / 12:40 PM IST

Reba Monica John Wants To Date Star Hero : ఆ స్టార్ హీరోతో డేట్ కు వెళ్తే తప్పులేదు.. సామజవరగమన హీరోయిన్ కామెంట్స్..!

Reba Monica John Wants To Date Star Hero :

ఈ నడుమ తెలుగు ఇండస్ట్రీలో మలయాళ భామల హవా బాగా పెరుగుతోంది. ఇప్పటికే తెలుగులో చాలామంది స్టార్ హీరోయిన్లు అక్కడి వారే ఉన్నారు. ఇక తాజాగా సామజవరగమన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రెబా మౌనిక. ఆమె వస్తూనే మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

అయితే ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయంట. ఈ క్రమంలోనే ఆమె ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. జెర్సీ సినిమాలో నాని సరసన చేసే ఛాన్స్ ముందుగా నాకే వచ్చింది. కానీ నేను అవనసరంగా వదులుకున్నాను.

ఆ ఛాన్స్ వస్తే చేస్తా..

ఇక అల్లు అర్జున్ కు నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలను అన్నీ చూస్తాను. కేరళలో ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఏ హీరోలకు లేని అభిమానులు కేవలం ఆయన సొంతం. అక్కడ ఆయన్ను మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తే అంతకన్నా ఇంకేం కోరుకోను అంటూ తెలిపింది.

Reba Monica John Wants To Date Star Hero

Reba Monica John Wants To Date Star Hero

ఇక మిమ్మల్ని ఏ హీరో అయినా డేట్ కు రమ్మని పిలిచారా అని యాంకర్ ప్రశ్నించింది. దానికి ఆమె స్పందిస్తూ.. పిలిచారు కానీ నేనే వెళ్లలేదు. ఒకవేళ ఛాన్స్ వస్తే అల్లు అర్జున్ తో వెళ్తాను. డేట్ కు వెళ్లడాన్ని వల్గర్ గా చూడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ లోనే చూడాలి అంటూ తెలిపింది ఈ బ్యూటీ.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us