Samantha: స‌మంత కోట్ల భ‌ర‌ణం అడిగినా, ఇవ్వ‌రు.. ఎందుకంటే..!

Samantha: సమంత-నాగ చైతన్య విడాకుల విషయం పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం(అక్టోబర్‌ 2) మేము.. విడిపోతున్నాం అంటూ చై-సామ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమ అభిమాన జంట విడిపోతున్న విషయాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. విడాకుల అనంతరం చై, సమంతకు ఇచ్చే భరణం అంశం కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Reasons Behind Samantha's Alimony Rejection
Reasons Behind Samantha’s Alimony Rejection

స‌మంత‌, నాగ‌చైత‌న్య పెళ్లికి ముందు ప్రీ మారిటల్ అగ్రిమెంట్ చేసుకున్నార‌ట‌. అంటే భ‌విష్య‌త్తులో ఎప్పుడైనా విడిపోతే భ‌ర‌ణం లాంటిది అడ‌గ‌కుండా ముందే అగ్రిమెంట్ చేసుకోవ‌డం అన్న‌మాట‌. అయితే ఇప్పుడు ఎలాగూ విడాకులు అయిపోయాయి క‌నుక ముందే చేసుకున్న ప్రీ మారిట‌ల్ అగ్రిమెంట్ ప్ర‌కారం.. సమంత‌కు చైత‌న్య భ‌ర‌ణం ఇవ్వాల్సిన ప‌నిలేద‌న్న‌మాట‌. ఈ విష‌యంలో సురేష్ బాబు, నిరంజ‌న్ రెడ్డి ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌.

చ‌ట్ట ప్ర‌కారంగా చూసినా స‌మంత‌కు భ‌ర‌ణం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. భ‌ర్త నుంచి విడిపోయిన మ‌హిళ‌కు ఎలాంటి ఆధారం లేక‌పోయినా, జీవించ‌డం క‌ష్టంగా ఉన్నా.. అలాంటి స్థితిలో భ‌ర‌ణం అడ‌గ‌వ‌చ్చు. కానీ స‌మంత అటు సినిమాల్లో, ఇటు యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తోంది. క‌నుక ఆమె చట్ట ప్ర‌కారంగా చూసినా భ‌ర‌ణం ఇవ్వాల్సిన ప‌నిలేదు.

అయితే , విడాకుల నేపథ్యంలో నాగచైతన్య, ఆయన కుటుంబం సమంతకు రూ.200 కోట్ల మేర భరణం చెల్లించేందుకు ప్రతిపాదించినట్టు తెలిసింది. నాగచైతన్య నుంచి తాను ఒక్క పైసా కూడా భరణంగా తీసుకోనని ఆమె స్పష్టం చేసినట్టు ప‌లు మీడియాలు చెప్ప‌గా, అవ‌న్నీ పుకార్లు అని వెల్ల‌డైంది.

ఫ్యామిలీ మ్యాన్‌ 2లో పలు అభ్యంతరకర సన్నివేశాల్లో సమంత నటించిన కారణంగానే చై-సామ్‌ మధ్య చెడిందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు, విభేదాలు తలెత్తడంతో వారిని ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ కూడా ఇప్పించారట. అప్పుడు వారి మధ్య మనస్పర్థలు తొలిగినప్పటికీ కొద్ది రోజులు మళ్లీ గొడవలు మొదలైయ్యేవని, దీంతో పలుమార్లు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు సమాచారం.