Priyanka Singh: ప్రియాంక ట్రాన్స్‌జెండ‌ర్‌గా మార‌డానికి పెద్ద‌మ్మ త‌ల్లే కార‌ణ‌మా..?

Priyanka Singh: ప్రియాంక సింగ్.. ఈ పేరు కొద్ది రోజుల ముందు వ‌ర‌కు కొంత మందికే తెలుసు.ఇప్పుడు చాలా ఫేమ‌స్.బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా అడుగుపెట్టిన ప్రియాంక సింగ్ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఎంతో మంది మ‌న‌సులు గెల‌చుకుంది. ఆ మ‌ధ్య త‌న క‌న్నీటి ప్రేమ గాథ‌ను చెప్పి వెక్కివెక్కి ఏడ్చింది. ‘అతని పేరు రవి.. అలా పిలవడం నాకు ఇష్టం లేక నేను ముద్దుగా అబ్బాయి అంటూ ఉంటా. ఆరేళ్లు రిలేష‌న్‌లో ఉన్నాం. త‌నంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది.

Reasons Behind Priyanka Singh Transformation to Transgender
Reasons Behind Priyanka Singh Transformation to Transgender

నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావ్ కదా అబ్బాయ్ అని అంటే.. నువ్ ఏమైనా అమ్మాయివా?? నీకు పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావ్‌? పెళ్లి ఏంటి పెళ్లి అని చిరాకు పడ్డాడు.. ఎందుకంటే నేను తల్లిని కాలేను. నీకు తెలుసో తెలియదో అబ్బాయ్.. నేను చాలా హాస్పటల్స్ తిరిగాను.. తల్లిని కావడం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టా అని షోలో చాలా ఎమోష‌న‌ల్‌గా చెప్పుకొచ్చింది ప్రియాం. అయితే తాను ట్రాన్స్‌జెండ‌ర్‌గా మారే ముందు పెద్ద‌మ్మ తల్లి ఆశీస్సులు తీసుకుంద‌ట‌.

ట్రాన్స్ జెండర్‌గా మారాలని అనుకున్నప్పుడు ఎవరి సలహా తీసుకోవాలో తెలియక.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సన్నిధికి వెళ్లి అక్కడ అమ్మవారు ఇచ్చిన నిర్ణయాన్ని బట్టే తాను ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నానని చెప్తుంది ప్రియాంక. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం అంటే ప్రసిద్ధి చెందిన దేవాలయం. అక్కడ అమ్మవారి సన్నిధిలో రూపాయి కాయిన్‌ని నిలబెట్టి మనసులో కోరిక కోరుకుంటారు.. ఆ కాయిన్ పడిపోతే ఆ కోరిక నెరవేరదని.. ఒకవేళ కాయిన్ నిలబడే ఉంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందని బలంగా నమ్ముతుంటారు భక్తులు.

ప్రియాంక కూడా తాను ట్రాన్స్ జెండర్‌గా మారాలని అనుకున్నప్పుడు పెద్దమ్మతల్లి దేవాలయానికి వెళ్లి.. రూపాయి కాయిన్‌ని నిలబెట్టి తన మనసులో కోరిక అమ్మవారితో చెప్పుకుందంట. అయితే ఆ రూపాయి కాయిన్ పడిపోకుండా నిలబడే ఉండటంతో అమ్మవారి అనుగ్రహం లభించింది అనుకుని వెంటనే ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జెండర్‌గా మారానని చెప్పుకొచ్చింది ప్రియాంక. అన్నట్టు ప్రియాంక అసలు పేరు సాయి తేజ మాత్రమే కాదు.. వరలక్ష్మి అని పిలుస్తారని చెప్పింది పింకీ.