NTR: ఎన్టీఆర్ అన్ని కార్ల‌కు 9999 నెంబ‌ర్ ఉంటుంది.. ఎందుకో తెలుసా?

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. ఆయ‌న ఇటీవ‌ల లంబోర్ఘిని అనే కారుని బుక్ చేసిన విష‌యం తెలిసిందే. ఇండియాలో లాంచ్‌ అయిన తొలి రోజే ఈ కారును ఎన్టీఆర్‌ బుక్‌ చేసుకున్నాడు. 3.16 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లంబోర్ఘినీ ఊరుస్‌ ఇటలీ నుంచి శంషాబాద్‌ ఎయిరపోర్టుకు ఆ తర్వాత తారక్‌ ఇంటికి చేరుకుంది. ఇటలీకి చెందిన వోక్స్‌ వాగన్‌ కంపెనీ అనుబంధ సంస్థయే ‘లంబోర్ఘిని’.

Reasons Behind NTR Car Number as 9999
Reasons Behind NTR Car Number as 9999

ఇప్పటికే ఎన్టీఆర్‌ గ్యారేజ్‌ 20పైగా కార్లు ఉండ‌గా, రీసెంట్‌గా లంబోర్ఘిని కారుని కూడా బుక్ చేశాడు. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే ఎన్టీఆర్ దగ్గర ఉన్న అన్ని కార్లకు ఒకే నెంబర్ ఉంటుంది. దీని వెనక ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. పైగా సినిమా ఇండస్ట్రీలో అన్నింటి కంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్. జూనియ‌క్ ఎన్టీఆర్ కూడా 9999 సెంటిమెంట్‌ని ఎక్కువ‌గా న‌మ్ముతాడు.


ఏ కొత్త కారు తీసుకున్నా కూడా దాని నెంబర్ మాత్రం 9999 ఉంటుంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్‌కు 9999 అనేది సెంటిమెంట్ అంటూ ప్రచారం జరిగింది. తన ప్రతీ కారుకు 9999 ఉండటంపై యంగ్ టైగర్ కూడా స్పందించాడు. అయితే అంతా అనుకుంటున్నట్లు తనకు కార్ నెంబర్ విషయంలో ఎలాంటి సెంటిమెంట్స్ లేవని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్.


తన కార్లకు 9999 నెంబర్ ఉండటం వెనక ఓ కారణం.. కథ ఉందని తెలియ‌జేసిన ఎన్టీఆర్… తనకు 9 అనే అంకె ఇష్టమని మాత్రం చెప్పాడు తారక్. తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నెంబర్‌ 9999 అని.. ఆ తర్వాత తన తండ్రి హరికృష్ట కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్‌ అంటే ఇష్టమని ఎన్టీఆర్‌ చెప్పాడు. అందుకే మరో ఆలోచన లేకుండా తన కార్లకు అదే నెంబర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.


ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కారుతో పాటు ఎన్టీఆర్ ట్విటర్‌ ఖాతా కూడా @tarak9999 అని ఉంటుంది. తాత, తండ్రి గుర్తుగా ఆ నెంబర్ కంటిన్యూ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.ఇటీవ‌ల కొన్న కారుకి కూడా ఎన్టీఆర్ అదే నెంబ‌ర్ తీసుకుంటాడ‌ట‌. 3,16 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్‌ అట. ఇక బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు. 200 కిమీ వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. పైగా 2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కి.మీ అందుకుంటుంద‌ని అంటున్నారు.


ఎన్టీఆర్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు టీవీ షోస్‌తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లో కొర‌టాల‌తో క‌లిసి సినిమా చేయ‌నున్నాడు. మ‌రోవైపు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే కార్య‌క్ర‌మంతో బిజీగాఉన్నారు. మ‌రోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, పరశురామ్, బుచ్చిబాబు లాంటి దర్శకులతో సినిమాలు చేయ‌నున్నారు.