NTR: ఎంతో ఇష్ట‌ప‌డే క్రికెట్‌పై అస‌హ్యం పెంచుకున్న ఎన్టీఆర్.. కార‌ణం ఎవ‌రో తెలుసా?

NTR: మ‌న సినీ సెల‌బ్రిటీల‌కు కొన్ని గేమ్స్ అంటే తెగ పిచ్చి. ముఖ్యంగా అఖిల్‌, మ‌హేష్ బాబు, వెంక‌టేష్ వంటి స్టార్స్ క్రికెట్‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. అంతేకాదు మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియంకు వెళ్లి అక్క‌డ తెగ సంద‌డి చేస్తుంటారు.మ‌హేష్ బాబు, వెంక‌టేష్ వంటి స్టార్స్ విదేశాల‌లో జ‌రిగిన మ్యాచ్‌ల‌కు హాజ‌ర‌య్యారు. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కూడా ఒక‌ప్పుడు క్రికెట్ అంటూ పిచ్చి ఉండేద‌ట‌. అది త‌న నాన్న వ‌ల‌న పోయింద‌ని చెప్పుకొచ్చాడు.


Reasona Behind NTR Hatred Over Cricket
Reasona Behind NTR Hatred Over Cricket


ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో పాల్గొన్న అభిరాం అనే కంటెస్టంట్‌కు 9వ ప్రశ్నగా క్రికెట్‌కు సంబంధించింది ఎదురైంది. ఈ సందర్భంగా తనకు క్రికెట్‌ ఆట అంటే చాలా ఇష్టమని చెప్పాడు. కానీ క్రికెట్‌ అంటేనే ఆసక్తి పోయేలా తన తండ్రి హరికృష్ణ చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


క్రికెట్‌ ఆడటమంటే చాలా ఇష్టం ఉండేది. కానీ క్రికెట్‌ను టీవీ చూడటానికి అసలు ఇష్టపడను. దానికి కారణం మా నాన్న. ఎందుకంటే చిన్నప్పుడు ఉదయం టీవీలో వచ్చే క్రికెట్‌ మ్యాచ్‌ను వీసీఆర్‌లో రికార్డు చేయమని చెప్పేవారు. అది ఎలా చేయాలో కూడా ఆయనే నేర్పించారు. దీంతో ఆ మ్యాచ్‌ను నేను పూర్తిగా చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత సాయంత్రం నాన్నతో కలిసి మళ్లీ అదే మ్యాచ్‌ను చూసేవాడిని. అలా చూసి చూసి చివరకు క్రికెట్‌ అంటేనే బోర్‌ కొట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు.


ప్ర‌స్తుతం సినిమాలు, మ‌రోవైపు బుల్లితెర షోతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్న ఎన్టీఆర్ కొమురం భీంగా క‌నిపించి అల‌రించ‌నున్నాడు. ఈ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ కోసం నందమూరి అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా ఇటీవల స్టార్ట్ చేశారు. మొదటి పాట తోనే సినిమాకు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశారు. త్వ‌ర‌లో ఎన్టీఆర్ కొర‌టాల‌తో క‌లిసి ఓ మూవీ చేయ‌నున్నాడు.