Getup Srinu: జబర్ధస్త్‌కు గెటప్ శ్రీను ఎందుకు దూరం అయ్యాడో తెలుసా?
Samsthi 2210 - June 14, 2021 / 03:46 PM IST

Getup Srinu: తెలుగు బుల్లితెరపై కామెడీ పంచుతున్న సక్సెస్‌ఫుల్ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ బుల్లితెరకు పరిచయం అయ్యారు. సినిమా కమెడీయన్స్‌కి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వీరు క్రేజ్ సంపాదించుకున్నారు.అంతేకాదు వెండితెర ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. అయితే జబర్ధస్త్ కార్యక్రమంలో పలు టీమ్స్ ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తుండగా, అందులో సుధీర్ టీం కూడా ఒకటి.

Reason Behind Getup Srinu not Act in Jabardasth
సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ ఈ ముగ్గురు కలిసి చేసే ఫన్ ప్రేక్షకులికి మంచి వినోదాన్ని అందిస్తుంటుంది.ముఖ్యంగా గెటప్ శ్రీను వైవిధ్యమైన గెటప్స్ వేస్తూ స్కిట్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. కొద్ది రోజలుగా గెటప్ శ్రీను .. సుధీర్ టీంలో కనిపించడం లేదు. కేవలం రాంప్రసాద్, సన్నీతోనే స్కిట్స్ చేస్తున్నాడు సుధీర్. దాంతో గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.దీనిపై సుధీర్ కూడా స్పందించకపోయే సరికి అనుమానం మరింత బలపడింది.
జబర్ధస్త్‌లో ఈ మధ్య పెను మార్పులు సంభవిస్తున్నాయి. ముందు దర్శక ద్వయం నితిన్, భరత్ వెళ్లిపోయారు. వాళ్లతో పాటు నాగబాబు కూడా జీ తెలుగుకు వెళ్లిపోయాడు. ఇక చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు కూడా అక్కడికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ముక్కు అవినాష్ బిగ్ బాస్ కోసం జబర్దస్త్ షోను వదిలేసాడు. ఇప్పుడు గెటప్ శ్రీను కూడా జబర్ధస్త్‌కి దూరం అయ్యాడంటూ జోరుగా ప్రచారాలు నడిచాయి. దీనిపై క్లారిటీ ఇచ్చాడు శ్రీను.
తాను ఎక్కడికి వెళ్లలేదని చెబుతూ ఓ వీడియో విడుదల చేసిన గెటప్ శ్రీను అందులో.. అందరికీ నమస్కారం.. మూవీ షూట్ అయిన తరువాత మా టీంలో కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.. నేను టెస్ట్ చేసుకోగా నెగెటివ్ వచ్చింది. కానీ కొన్ని రోజులు బయటకు రాకూడదని, హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఆ టైంలో జబర్దస్త్ షూటింగ్‌కి వెళ్లడం కుదరలేదు.. మరల 18వ తేదీన శుక్రవారం మన షోలో కలుద్దాం. మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ మీ గెటప్ శ్రీను అంటూ క్లారిటీ ఇచ్చాడు .
గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ అనే చిత్రం తెరకెక్కుతుండగా, ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చేశాడు. ఇందులో కోరమీసాలతో కనిపించనున్నాడు. అతి త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలోను శ్రీను పలు సినిమాలలో ప్రధాన పాత్రలు చేయగా, అవి సత్ఫలితాన్నిఅందించలేదు. ఈ సినిమాతో అయిన శ్రీను హీరోగా నిలుస్తాడా అన్నది చూడాలి.